మాజీ మంత్రి, వైసీపీ ఎమ్యెల్సీ బొత్స సత్యన్నారాయణ కళ్ళు తిరిగిపోయిన ఘటన విజయనగరం చీపురుపల్లిలో జరిగింది. ఈరోజు బుధవారం జగన్ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో బొత్స పాల్గొని అక్కడ మాట్లాడుతున్న సమయంలో ఆయన ఉన్నట్టుండి కిందపడిపోయారు.
చీపురుపల్లి లో వేదిక పై ఉండగా వడ దెబ్బ తో సొమ్మసిల్లిపోయిన బొత్స సత్యనారాయణను అక్కడే ఉన్న వైకాపా నేతలు, కార్యకర్తలు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. ఆయన వేదికపై మాట్లాడుతూ.. ఉండగానే బొత్స సత్యన్నారాయణ కుప్పకూలిపోవడంతో వైసీపీ కార్యకర్తలు కంగారు పడ్డారు.




కన్నప్పని వాయిదా వేసే ఆలోచనే లేదు-విష్ణు 

Loading..