Advertisementt

ఫైనల్లీ జాట్ ఓటీటీ డేట్ లాకయ్యింది

Tue 03rd Jun 2025 03:08 PM
jaat  ఫైనల్లీ జాట్ ఓటీటీ డేట్ లాకయ్యింది
Finally Jaat Releasing On OTT ఫైనల్లీ జాట్ ఓటీటీ డేట్ లాకయ్యింది
Advertisement
Ads by CJ

తెలుగు దర్శకుడు, తెలుగు బడా నిర్మాణ సంస్థ బాలీవుడ్ వెళ్లి అక్కడి సన్నీ డియోల్ ని హీరోగా పెట్టి తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జాట్ చిత్రం హిందీలో బిగ్ హిట్ అయ్యింది. దర్శకుడు గోపీచంద్ మలినేని , మైత్రి మూవీస్ నిర్మాతలు కలిసి చేసిన జాట్ నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. అయితే ఆ చిత్రం కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అప్పటినుంచి ఆ చిత్రం తెలుగులో  ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తుందా అని తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

గత ఏప్రిల్ లో బాలీవుడ్ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు వరకు ఓటిటిలో మాత్రం రాలేదు. జాట్ స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తెలుగులో రిలీజ్ లేకుండానే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసుకుంది.

ఓటీటీలోనూ తెలుగు డబ్బింగ్ లేకుండానే ఈ జూన్ 6 నుంచి కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులోకి రానున్నట్టుగా అనౌన్స్ చేసారు. మరి జాట్ ను తెలుగు ఆడియన్స్ కి దగ్గర చెయ్యరా, అసలు జాట్ తెలుగులో ఉంటుందా, ఉండదా అనేది సస్పెన్స్ గా మారింది. 

Finally Jaat Releasing On OTT:

Jaat OTT release date locked

Tags:   JAAT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ