బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దేవర హిట్ తర్వాత జాన్వీ కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది మూవీలో నటిస్తుంది.. ఇప్పటికే ఆమె పెద్ది సెట్ లో జాయిన్ అయ్యింది. మధ్యలో ఆమె తన కొత్త సినిమా ప్రమోషన్స్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం సమయాన్ని కేటాయించింది.
ఇక ఇప్పుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్ర లాంగ్ షెడ్యూల్ కోసం అమ్మడు హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఇప్పటికే పెద్దికి సంబందించిన రెండు షెడ్యూల్స్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన నుంచి అదిరిపోయే గిఫ్ట్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ది లాంగ్ షెడ్యూల్ కోసం జాన్వీ కపూర్ ఎక్కువ కాల్షీట్స్ కేటాయించినట్లుగా తెలుస్తుంది. అంటే జాన్వీ కొద్దిరోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనుంది. రామ్ చరణ్ బర్త్ డే కి వదిలిన పెద్ది గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు విలన్స్ గా నటించనున్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది మార్చ్ లో రామ్ చరణ్ బర్త్ డే కి విడుదల అయ్యేలా ప్లాన్ చేసారు మేకర్స్.