దేవర లా చెయ్యకండి ప్లీజ్

NTR fans request to Yash Raj FilmsNTR fans request to Yash Raj Films

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రాన్నిపెద్దగా ప్రమోషన్స్ లేకుండానే విడుదల చెయ్యడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర నిర్మాణ సంస్థ పై ఫైర్ అయ్యారు. ముంబై లో కేవలం ఒక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తోనే సరిపెట్టెయ్యడం వాళ్లకు అస్సలు నచ్చలేదు. ఇటు తెలుగులోనూ దేవర చిత్రాన్నిపెద్దగా ప్రమోట్ చెయ్యలేదు. 

ఇప్పుడు వార్ 2 కి కూడా దేవర లా చేస్తారేమో అని ఎన్టీఆర్ అభిమానులు భయపడుతున్నారు. అసలే టీజర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో తీవ్ర అసంతృప్తి ఉంది. వార్ 2కి పోటీగా అదే రోజు రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ ల కూలి విడుదలకాబోతుంది. కూలి నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా అది ఇట్టే వైరల్ అవుతుంది. 

ఇప్పటికి వార్ 2 షూటింగ్ పూర్తి కాలేదు, ఎన్టీఆర్-హృతిక్ రోషన్ పై ఇంకా సాంగ్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. అలాగే అయాన్ ముఖర్జీ ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా పెండింగ్ ఉన్నట్టుగా వస్తున్న వార్తలు ఎన్టీఆర్ అభిమానులను కలవరపరుస్తోంది. దేవర కూడా చివరివరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే వారి ఆందోళనకు కారణం. వార్ 2 విషయంలో అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని వారి కోరిక. మరి అయాన్ ముఖర్జీ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. 

NTR fans request to Ayan Mukerji

ntr