ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Surveen Chawla on Disturbing Casting Couch Experience

ద‌ర్శ‌కుడి వేధింపులు.. న‌టి పబ్లిసిటీ స్టంటా

Surveen Chawla on Disturbing Casting Couch ExperienceSurveen Chawla on Disturbing Casting Couch Experience

త‌న‌ను ప్ర‌ముఖ ద‌క్షిణాది ద‌ర్శ‌కుడు క‌మిట్ మెంట్ అడిగాడ‌ని, అత‌డు జాతీయ అవార్డ్ అందుకున్న ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి తాను బ‌య‌ట‌కు చెప్ప‌లేద‌ని వ్యాఖ్యానించింది సుర్వీన్ చావ్లా. ఒక మ‌ధ్య‌వ‌ర్తితో త‌న‌కు క‌మిట్ మెంట్ గురించి అడిగించాడ‌ని కూడా తెలిపింది. అలాగే ఒక బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆఫీస్ లో చ‌ర్చ‌ల త‌ర్వాత ఇంటికి వెళుతుంటే, గేటు ద‌గ్గ‌ర‌కు సాగ‌నంపుతూ ముందుకు వంగి ముద్దు పెట్టుకున్నాడ‌ని, త‌న‌కు పెళ్ల‌యింద‌ని తెలిసీ అత‌డు అలా చేయ‌డం షాకిచ్చింద‌ని వెల్ల‌డించింది. అయితే ఇవ‌న్నీ జ‌రిగి చాలా కాలం అయ్యాయి. కానీ ఇప్పుడు స‌డెన్ గా సుర్వీన్ బ‌య‌ట‌పెట్ట‌డంపై చాలా సందేహాలు నెల‌కొన్నాయి. ఇలాంటి ప్ర‌చారంతో సుర్వీన్ అవ‌కాశాలు కొట్టేయాల‌ని అనుకుంటోందా? అంటూ కొంద‌రు నెటిజ‌నులు ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.

 

తెలుగులో రాజు మ‌హారాజు, రాణా నాయుడు సీజ‌న్ 2  లో న‌టించిన సుర్వీన్ తాజా ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం గురించి ఓపెన‌య్యారు. ద‌క్షిణాదినా జాతీయ అవార్డ్ అందుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌మిట్ మెంట్ అడిగాడ‌ని, దాని కోసం వేరొక వ్య‌క్తితో క‌బురు పంపించాడ‌ని సుర్వీన్ వెల్ల‌డించింది. అప్ప‌టికి తాను ఆ ద‌ర్శ‌కుడి పేరు, వివ‌రాలు వెల్ల‌డించాల‌ని అనుకోలేద‌ని తెలిపింది.

 

అయితే ఘ‌ట‌న‌లు జ‌రిగిన చాలా కాలం త‌ర్వాత సుర్వీన్ వీటిని సెన్సేష‌న్ కోసం చెబుతోందా?  త‌ప్పు జ‌రిగిన‌ప్పుడే ఎందుకు ఆరోపించ‌లేదు! అంటూ  నెటిజ‌నులు చీవాట్లు పెడుతున్నారు. కొంద‌రు ప్ర‌మోష‌న్స్ కోసం కూడా ఇలా ఆరోపిస్తార‌ని త‌ప్పు ప‌డుతున్నారు. సుర్వీన్ న‌టించిన శాక్రెడ్ గేమ్స్, హేట్ స్టోరి 4 యువ‌త‌రాన్ని విశేషంగా ఆక‌ర్షించాయి. సుర్వీన్ బోల్డ్ పెర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవ‌ల రాణా నాయుడు 2లోను సుర్వీన్ బాగానే న‌టించింది. కానీ గుర్తింపు ద‌క్కిన ఇలాంటి స‌మ‌యంలో వివాదాస్ప‌ద వైఖ‌రితో ప‌రిశ్ర‌మ‌లో శ‌త్రుత్వం పెంచుకోవ‌డం స‌రికాద‌ని కూడా అభిమానులు సూచిస్తున్నారు. 

Surveen Chawla on Casting Couch

surveen chawla