Advertisementt

శ్రీలీల ఇంట్లో వేడుకలు-ట్విస్ట్ ల మీద ట్విస్టులు

Sat 31st May 2025 09:23 PM
sreeleela  శ్రీలీల ఇంట్లో వేడుకలు-ట్విస్ట్ ల మీద ట్విస్టులు
Sreeleela Birthday Celebration Goes VIral శ్రీలీల ఇంట్లో వేడుకలు-ట్విస్ట్ ల మీద ట్విస్టులు
Advertisement
Ads by CJ

ఈరోజు ఉన్నట్టుండి బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల పెళ్లి పీటలెక్కబోతుంది, అందుకే ఆమె ఇంట్లో హల్దీ వేడుకలను నిర్వహించారంటూ శ్రీలీల సోషల్ మీడియా పోస్ట్ చూసిన వారంతా ఫిక్స్ అయ్యారు. ఆమె బిగ్ అప్ డేట్, కమింగ్ సూన్ అంటూ పెట్టిన పోస్ట్ చూసిన ఆమె అభిమానులు శ్రీలీల పెళ్లి చేసుకోబోతుంది అనుకున్నారు. కట్ చేస్తే సాయంత్రానికి శ్రీలీల మరిన్ని ఫోటోస్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి షేర్ చేసింది. 

ఉదయం ఫొటోస్ లో శ్రీలీల అందంగా ముస్తాబయ్యి కట్టు బొట్టుతో పాటు గంధం కూడా పూసుకుని కనిపించింది. సాయంత్రానికి శ్రీలీల ను పెళ్లికూతురులా బుట్టలో కూర్చోబెట్టడం, శ్రీలీల ఇంట్లో పెళ్లి జరిగే తంతు మాదిరి పూల డెకరేషన్ ఇవన్నీ ఆమె పెళ్లి రూమర్స్ కు ఆజ్యం పోశాయి. అచ్చం పెళ్లి కూతురులా శ్రీలీలను బుట్టలో చూసేసరికి అందరికి మతిపోయింది. ఇక ఈ సస్పెన్స్ కొనసాగించడం ఇష్టం లేని శ్రీలీల ఫొటోస్ వెనుక అసలు ట్విస్ట్ ను రివీల్ చేసింది.  

శ్రీలీల ఆ ఫొటోస్ తో పాటుగా.. మా ఇంట్లో పెళ్లి కాదు, మా ఇంట్లో బర్త్ డే వేడుకలు ఇంతే సాంప్రదాయంతో జరుగుతాయి అంటూ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. తన బర్త్ డే కి ఇంత హంగామా చేసింది తన మదర్ అని, ఈ క్రెడిట్ అంతా కూడా తన మదర్ దే అంటూ శ్రీలీల అసలు విషయాన్ని కూల్ గా చెప్పుకొచ్చింది. 

వామ్మో ఇదేం బర్త్ డే వేడుకలు శ్రీలీలా.. బర్త్ డే కే ఇలా చేస్తే పెళ్లి వేడుకలు ఇంకెంత గ్రాండ్ గా చేస్తారో అంటూ నెటిజెన్స్ షాకవుతున్నారు. 

Sreeleela Birthday Celebration Goes VIral:

Sreeleela mother celebrated Sreeleela birthday in a traditional way

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ