1000 కోట్ల క్లబ్ వద్దన్న స్టార్ డైరెక్టర్

వెయ్యి కోట్లు, అంతకుమించి వసూలు చేసే సత్తా నేడు టాలీవుడ్ కి ఉంది. దక్షిణాదిన శాండల్వుడ్ కూడా టాలీవుడ్ ని ఫాలో అవుతోంది. కానీ మేమంతా తోపులం.. మా తర్వాతే ఎవరైనా అని చెప్పుకునే తమిళ చిత్ర పరిశ్రమకు ఇది ఇప్పటికీ సాధ్యపడలేదు. 1000 కోట్ల క్లబ్ కోసం ఆరాటపడినా కానీ, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు దానిని అందించడంలో తడబడ్డారు. దీంతో కోలీవుడ్ రేసులో వెనకబడింది.
ఇదే ప్రశ్నను దిగ్గజ దర్శకుడు మణిరత్నంని ప్రశ్నించగా, అతడు ఇచ్చిన జవాబు ఆశ్చర్యపరిచింది. డబ్బు సంపాదనే ప్రధానంగా సినిమాలు తీస్తే, ఆ ఒత్తిడి కారణంగా మంచి సినిమాలను, ప్రామాణికమైన సినిమాలను అందించలేమని అన్నారు. సృజనాత్మకతను వెంబడించాలి కానీ, డబ్బును కాదని అన్నారు. అయితే జూన్ 5న విడుదలకు వస్తున్న మణిరత్నం `థగ్ లైఫ్` వెయ్యి కోట్ల క్లబ్ ని వెంబడించదని ప్రజలు భావించాలి.
బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ 2 , పుష్ప 2 ఇవన్నీ 1000 కోట్ల క్లబ్ సినిమాలు. సృజనాత్మకంగా మెప్పించాయి కాబట్టే ప్రజలు వీటికి వెయ్యి కోట్ల క్లబ్ అందించారు. కానీ మణి సర్ సమాధానం దీనికి భిన్నంగా ఉంది. మణిరత్నం తెరకెక్కించిన పిఎస్ 1, పిఎస్ 2 చిత్రాలు రెండూ కలిపినా 1000కోట్ల క్లబ్ సాధ్యపడలేదు. వాటిలో చాలా క్రియేటివిటీ ఉంది. కానీ ఏం లాభం?
Mani Ratnam discussed why Tamil cinema has not hit the Rs 1000 crore mark
Is the 1000 crore club killing creativity








































