కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ వెనుక మనోజ్- విష్ణు

మంచు బ్రదర్స్ మద్య ఆస్తి తగాదా కాస్తా ఇపుడు ప్రొఫెషనల్ వైపు మళ్లింది. కన్నప్ప దొంగప్ప అంటూ అన్న మంచు విష్ణు కన్నప్పపై మంచు మనోజ్ చేసిన కామెంట్స్ చూసారు, దానికి భైరవం ప్రమోషన్స్ లో సారీ చెప్పడమూ చూసారు. ఈలోపు మంచు విష్ణు కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్ అవడం, అది రఘు, చరిత అనే ఇద్దరు వ్యక్తులే మిస్ చేసారని కేసు నమోదు అవడం కూడా తెలిసిందే.
అయితే మంచు మనోజ్ రీసెంట్ గా భైరవం ఈవెంట్ లో చరిత(కన్నప్ప హార్డ్ డ్రైవ్ పట్టుకుపోయిన మహిళా పేరు కూడా చరిత) అనే అమ్మాయికి థాంక్స్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మంచు మనోజే వెనకుండి కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్ చేయించాడా అనే అనుమానాలు తలెత్తే లోపు కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం అవడంపై విష్ణు రియాక్ట్ అయ్యాడు.
కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పనిచేసే వారే మాయం చేశారు, మనోజ్ ఇంట్లో పని చేసే రఘు, చరిత అనే ఇద్దరు వ్యక్తులే ఈ పని చేశారని, వాళ్ళ సొంతంగా చేశారా లేక ఎవరైనా చెబితే చేశారా అనేది తెలియాల్సి ఉందని మంచు విష్ణు ఆరోపిస్తున్నారు. అయితే హార్డ్ డ్రైవ్ లోని కంటెంట్ లీక్ అయినా ఎవరూ స్ప్రెడ్ చెయ్యొద్దు అని విష్ణు కోరారు.
మాయమైన హార్డ్ డిస్క్‌లో కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పూర్తి చేసిన డేటా ఉందని, హాలీవుడ్‌లో మూడు కాపీలు, హైదరాబాద్‌లో రెండు కాపీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కాపీలు వేర్వేరు కార్లలో ఒకటి డీఐటీ టెక్నీషియన్ దగ్గరకు, మరొకటి ఆఫీస్‌కు వెళతాయి. ఇది సాధారణంగా జరిగేదే. ఇప్పుడు అదే మిస్ అయ్యింది అని విష్ణు అన్నారు.
హార్డ్ డ్రైవ్‌లో ఉన్నది 70 నిమిషాల ఫుటేజ్ అని, అది కేవలం వీఎఫ్‌ఎక్స్ పనులకు సంబంధించిన డేటా మాత్రమేనని, పూర్తి సినిమా సన్నివేశాలు అందులో లేవని, ఒకవేళ అది లీక్ అయినా ఆన్ లైన్ లో దానిని ఎవరూ ప్రోత్సహించవద్దని విష్ణు అభ్యర్ధించారు.
Manchu Vishnu accuses his brother Manoj of stealing Kannappa missing hard disk
Manchu Vishnu About Kannappa Hard Disk Missing Controversy








































