Advertisementt

హిట్ నచ్చింది అంటున్న ఓటీటీ ఆడియన్స్

Fri 30th May 2025 07:29 PM
hit 3  హిట్ నచ్చింది అంటున్న ఓటీటీ ఆడియన్స్
Hit 3 OTT talk హిట్ నచ్చింది అంటున్న ఓటీటీ ఆడియన్స్
Advertisement
Ads by CJ

హీరో నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ చిత్రం మంచి హిట్ అవడంతో.. దానికి సీక్వెల్ గా అడివి శేష్ ని హీరోగా పెట్టి హిట్ 2 సినిమా చేసారు నాని-శైలేష్ కొలను. అయితే హిట్ చిత్రంలో కథ, విశ్వక్ సేన్ బ్యాక్ స్టోరీ పై ఉన్న క్యూరియాసిటీ, అందులోని కేస్ స్టడీ, విశ్వక్ సేన్ యాక్టింగ్ అన్ని ప్రేక్షకులకు నచ్చాయి. 

ఇక హిట్ 2 లో అడివి శేష్ పెరఫార్మెన్స్ నచ్చినా.. అందులోని కేసు, అలాగే ట్విస్ట్ లు అన్ని నచ్చినా హిట్ గ్రిప్పింగ్ స్టోరీ హిట్ 2 లో లేదు అన్నారు. ఇప్పుడు నాని హీరో గా హిట్ 3 వచ్చింది, A సర్టిఫికేట్ తో మే 1 న థియేటర్స్ లో విడుదలైన హిట్ 3 బ్లాక్ బస్టర్, 100 కోట్లు కొల్లగొట్టింది అంటూ మేకర్స్ పోస్టర్స్ వేశారు. 

ఆ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో విడుదలైంది. ఓటీటీలో చూసిన చాలామంది హిట్ 3 ని నాని కన్నా అడివి శేష్ చేసుంటే బావుంటుంది, హిట్ 3 లో కథ లేదు, జస్ట్ ఆర్గాన్స్ మిస్సింగ్ అంటూ డార్క్ సైట్ లోకి వెళ్లి బిజినెస్ చెయ్యడమే, ఇదంతా ఓల్డ్ ఫార్మేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హిట్ 2, హిట్ 3 కన్నా మాకు విశ్వక్ సేన్ హిట్ చిత్రమే నచ్చింది. హిట్ 3 లో విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ చేసుంటే బావుండేది, హిట్ 2, హిట్ 3 జస్ట్ రొటీన్ స్టోరీస్ అంటూ ఓటీటీ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Hit 3 OTT talk:

Hit 3 OTT audience talk

Tags:   HIT 3
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ