హీరోయిన్లకు దడ పుట్టిస్తున్నాడు!

ప్రముఖ తెలుగు డైరెక్టర్ తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్... సినీపరిశ్రమల్ని ఒణికిస్తోంది. రంగుల పరిశ్రమలో మనుగడ సాగిస్తున్న చాలా మంది అగ్ర కథానాయికలు, నటీమణులను ఆలోచింపజేస్తోంది. ఇలా సెట్ కి వచ్చి అలా ఆడేసుకుని వెళ్లిపోవడానికి పెట్టుబడి పెట్టే నిర్మాతకు కదా పెయిన్ ఉండేది.. కానీ దీనిని చాలామంది పాపులర్ కథానాయికలు, సీనియర్ నటీమణులు పట్టించుకునే పరిస్థితి ఉండదు. సమయానికి సెట్ కి రావడంలో ఫెయిలయ్యే సీనియర్ భామలు ఉన్నారు. కొందరు ప్రచారానికి రాలేమని ఖరాకండిగా చెప్పేసే నటీమణులతోను సమస్యలున్నాయి.
కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ప్రకంపనాలు రేపుతోంది. ఈ నిర్ణయం అన్ని సినీపరిశ్రమల్లో చర్చగా మారింది. కేవలం 6 గంటలే పని చేస్తానని, ఎనిమిది గంటల పని దినానికి అంగీకరించని దీపిక పదుకొనేను సందీప్ వంగా అగ్ర కథానాయిక అని కూడా ఆలోచించకుండా, నిర్ధయగా సినిమా నుంచి తొలగించాడు. తనకు క్రమశిక్షణ, టైమ్ మెయింటెనెన్స్ చాలా ముఖ్యమని అతడు సందేశం పంపాడు. ఈ దెబ్బకు సెట్స్ కు లేటుగా వచ్చే కథానాయికలు, ఇతర నటీనటులు కూడా ఇప్పుడు లేట్ గా వెళ్లేందుకు భయపడుతున్నారట. 8గంటల పనిదినం నియమం ప్రకారం .. సెట్లో పని చేసేందుకు ఎవరికి వారు ప్రిపేరవుతున్నారు. అయితే తెలుగు చిత్రసీమలో క్రమశిక్షణకు సమస్య ఏమీలేదు. కానీ బాలీవుడ్ లో సినిమా షూటింగ్ అంటే, అస్తవ్యస్థంగా ఉంటుందని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని చేసే స్టార్లు రెగ్యులర్ గా చెబుతుంటారు. కొందరు సీనియర్ హీరోలు అయితే మధ్యాహ్నం కూడా సెట్స్ కి వస్తారు.
ఇటీవల `మా` హారర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న కాజోల్ పొరపాటున తాను తక్కువ పని గంటల్లో పని చేసేందుకే ఇష్టపడతాను అని వ్యాఖ్యానించింది. అయితే దానిని కవర్ చేస్తూ, తన పక్కనే ఉన్న భర్త అజయ్ దేవగన్ కొత్తగా తల్లులు అయిన వారిని ఫిలింమేకర్స్ అర్థం చేసుకుంటారని, వారి మధ్య అండర్ స్టాండింగ్ ఉంటుందని అన్నారు. అంతేకాదు.. కొత్తగా తల్లులు అయినా కానీ 8గం.లు పని చేయాలని అడగడం తప్పు కాదు కదా? అని ప్రశ్నించారు. ఆ గొడవ ఆ ఇద్దరి వ్యక్తిగతం మాత్రమే. ఇండస్ట్రీకి దీనిని ఆపాదించవద్దనే కోణంలో దేవగన్ సమాధానం ఇచ్చారు. మొత్తానికి కాజోల్ అలవాటు ఏంటో ముందే చెప్పేయగా, దీనిని కవర్ చేసేందుకు స్టార్ హీరో అజయ్ దేవగన్ చాలా శ్రమించాడు. ఈసారి ఈ సీనియర్ నటి కూడా 8గంటల పని దినానికి అలవాటు పడుతుంది. బాలీవుడ్ నటీమణులు, ఇతర స్టార్లలో కూడా సందీప్ వంగా కఠిన నిర్ణయం వేవ్స్ క్రియేట్ చేస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
Is this your feminism - Sandeep Reddy Vanga targets Deepika
Telugu director who is making heroines tremble








































