Advertisementt

ఓటీటీ ప్రేక్షకులకు పండగే పండగ

Fri 30th May 2025 12:24 PM
thudarum  ఓటీటీ ప్రేక్షకులకు పండగే పండగ
A feast for OTT audiences ఓటీటీ ప్రేక్షకులకు పండగే పండగ
Advertisement
Ads by CJ

ఈరోజు అంటే మే 30 ఓటీటీ ప్రేక్షకులకు పెద్ద పండగ అనే చెప్పాలి. నిన్న మే 29 న నాని హిట్ చిత్రం హిట్ 3 నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ లోకి రాగా.. ఈరోజు క్రేజీ చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మోహన్ లాల్ తుడరుమ్ ఈరోజు నుంచి ఓటీటీలో సందడి చేస్తుంది. 

మోహన్ లాల్-శోభనల తుడరుమ్ చిత్రం మే 30 నుంచి అంటే ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియో ప్లస్ హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేసారు. ఫైనల్లీ తుడరుమ్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన తుడరుమ్ ని అక్కడి మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో వీక్షించేస్తున్నారు. 

ఇక సూర్య-పూజ హెగ్డే కాంబోలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన రెట్రో కూడా ఈరోజు నుంచే ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి రెట్రో మే 30 నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సో ఈ వారంలో క్రేజీ చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తున్నాయన్నమాట.  

A feast for OTT audiences:

Hit 3, Thudarum and Retro now streaming on different otts

Tags:   THUDARUM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ