Advertisementt

మహేష్ ఫ్యాన్స్ ఫుల్ గా తాగి.. నిర్మాత

Thu 29th May 2025 03:43 PM
khaleja  మహేష్ ఫ్యాన్స్ ఫుల్ గా తాగి.. నిర్మాత
Mahesh Babu fans themselves killed Khaleja మహేష్ ఫ్యాన్స్ ఫుల్ గా తాగి.. నిర్మాత
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన ఖలేజా చిత్రం అప్పట్లో థియేటర్స్ లో ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఆతర్వాత బుల్లితెర పై ఖలేజా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఖలేజా విడుదలై ఎన్నేళ్లయినా ఖలేజాని టీవి లో చూసినప్పుడు ప్రేక్షకులు ఇప్పటికి ఎంజాయ్ చేస్తున్నారు, మహేష్ కామెడీ టైమింగ్ ని చిన్నపిల్లల వరకు పొగుడుతున్నారు. అలాంటి సినిమా థియేటర్స్ లో ఎలా ప్లాప్ అయ్యిందో అర్ధం కాక చాలామంది బుర్రలు పగలగొట్టుకున్నారు. 

ఇప్పుడు మే 30 న ఖలేజా రీ రిలీజ్ అవుతుంటే మాత్రం మహేష్ అభిమానులు ఖలేజా ను రికార్డ్ స్థాయిలో హిట్ చేసేందుకు తపనపడుతున్నారు. కాని ఖలేజా రిలీజ్ సమయంలో నిర్మాతతో సినిమా బెన్ ఫిట్ షో వేయించి ఆ సినిమా చూసాక తాగి మహేష్ అభిమానులు ఖలేజా దర్శకనిర్మాతలు తిట్టిన విషయాన్ని తాజాగా నిర్మాత కళ్యాణ్ బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఖలేజాను వారు ఏదో ఊహించుకున్నారు. కానీ సినిమా చూసాక మహేష్ కామెడీ ని తట్టుకోలేకపోయారు, మిడ్ నైట్ షో అయ్యాక ఫుల్ గా తాగేసి మాకు ఫోన్ చేసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. వాళ్లకు వాళ్ళే మెసేజెస్ పంపించుకుని ఖలేజాని ఎంత నెగెటివ్ చేసుకోవాలో అంత నెగెటివ్ చేసుకుని సినిమాని చంపేశారు, మొత్తం మహేష్ ఫ్యాన్సే చేసారు అంటూ నిర్మాత కళ్యాణ్ ఖలేజా రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 

కానీ ఇప్పుడు అదే సినిమాని హిట్ చెయ్యాలని కంకణం కట్టుకునాన్రు, సినిమా అంత చెత్తగా లేదు, కానీ అప్పుడలా చేసినందుకు వారు ఇప్పుడు సారీ చెబుతున్నారు అని కళ్యాణ్ ఆ ప్రెస్ మీట్ లో చెప్పారు. 

Mahesh Babu fans themselves killed Khaleja:

Mahesh Fans Blamed for Khaleja Flop

Tags:   KHALEJA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ