Advertisementt

పవన్ రారు-వీరికి తప్పదు

Wed 28th May 2025 10:25 PM
pawan kalyan  పవన్ రారు-వీరికి తప్పదు
Pawan Skips Promotions For HHVM పవన్ రారు-వీరికి తప్పదు
Advertisement
Ads by CJ

హరి హర వీరమల్లు ప్రమోషన్స్ కు పవన్ రావట్లేదు, కానీ దర్శకనిర్మాతలకు తప్పేట్టులేదు.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ అర్వాత ఎట్టకేలకు పవన్ హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి చెయ్యడంతో మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేసారు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ OG షూటింగ్ షురూ చేసారు. దానితో వీరమల్లు మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి హైదరాబాద్ లో ఓ సాంగ్, చెన్నై లో మరో సాంగ్ రిలీజ్ చేసారు. 

అసలే హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. అందుకే మేకర్స్ హరి హర వీరమల్లు రిలీజ్ అయ్యే అన్ని భాషల్లో ఆడియన్స్ కు దగ్గర చేసేలా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. కారణం ఆయన ముంబైలో జరుగుతున్న OG సెట్లో ఉన్నారు. 

అయితే జూన్ 2 న రాబోయే హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఏమైనా పవన్ కనిపిస్తారా, లేదంటే తిరుపతిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమైనా పవన్ కనబడతారా అని పవన్ ఫ్యాన్స్ ఆత్రుత చూపిస్తున్నారు. మరోపక్క పాన్ ఇండియా ప్రమోషన్స్ కు మాత్రం పవన్ రారు, ఆ తిప్పలేవో దర్శకనిర్మాతలతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఇంకా హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రమే పడాలి.. అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.  

Pawan Skips Promotions For HHVM:

Pawan Kalyan Skips Promotions For Hari Hara Veera Mallu

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ