పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ రాజా సాబ్. రాజా సాబ్ టీజర్ అలాగే రిలీజ్ తేదీ కోసం ప్రభాస్ అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. తాజాగా రాజా సాబ్ టీజర్ జూన్ లో వస్తున్నట్టుగా కన్ ఫర్మ్ చేసారు. అయితే పాన్ ఇండియా టీజర్ కాబట్టి ఈ టీజర్ డబ్బింగ్ విషయంలో మారుతి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట
మరో పక్క రాజా సాబ్ రిలీజ్ తేదీ విషయంలో మేకర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా ఓ న్యూస్ వైరల్ అయ్యింది. రాజా సాబ్ రిలీజ్ తేదీ ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యింది, ఆతర్వాత రాజా సాబ్ ఎప్పుడు రిలీజ్ ఉంటుందో తెలియక ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయంలో పడుతున్నారు. రాజా సాబ్ సెప్టెంబర్లో రిలీజ్ ఉంటుంది అనుకున్నారు.
కానీ ఇప్పుడు డిసెంబర్ 5 కానీ, లేదంటే సంక్రాంతికి కానీ రాజా సాబ్ ని విడుదల చేసేందుకు మేకర్స్ చూస్తున్నారట. ముందు సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ లో రాజా సాబ్ విడుదల అనుకున్నా పాన్ ఇండియా తేదీలు సరిపోవడం లేదు అని, డిసెంబర్ కానీ, సంక్రాంతి కానీ అయితే బావుంటుంది అని ఆలోచిస్తున్నారట. మరి టీజర్ తో పాటుగా రాజా సాబ్ తేదీ కూడా ఇస్తారు, అపుడు కానీ రిలీజ్ తేదీపై క్లారిటీ రాదు.