యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ని ప్రకటించాడు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్రిప్తి దిమ్రీ కథానాయికగా ఎంపికైంది. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనే నటించాల్సి ఉండగా, తన స్థానంలో, సందీప్ ట్రిప్తీని ఎంపిక చేయడం హాట్ టాపిగ్గా మారింది.
అయితే ట్రిప్తీ ఎంపిక తర్వాత నెటిజనులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ సినిమాలో ట్రిప్తి దిమ్రీ ఎక్స్ పోజింగ్ మరో లెవల్లో ఉంటుందని, యామినల్ ని మించిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఒక గ్లామరస్ పాత్ర కోసం ట్రిప్తీని సందీప్ ఎంపిక చేసుకున్నాడని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక నెటిజన్ యానిమల్ సీక్వెల్ తీస్తున్నాడని కూడా కామెంట్ చేసాడు.
ట్రిప్తి ఎంపిక తర్వాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. ట్రిప్తి తన గ్లామర్ ని అన్ లిమిటెడ్ గా అందించేందుకు `ఆత్మ`తో పని చేస్తుందనే అర్థం వచ్చేలా ఆర్జీవీ కామెంట్ చేయడం చర్చగా మారింది. ఎక్స్ ఖాతాలో ఆర్జీవీ ట్రిప్తీ ఎంపికను ప్రశంసించారు.
దీనికి ప్రతిస్పందించిన ట్రిప్తీ ఆనందం వ్యక్తం చేస్తూ... థాంక్యూ సార్.. మీ నుండి చాలా రావడం అంటే మీనింగ్...అంటూ ముగింపు ఇవ్వకుండా, ప్రశ్నను రైజ్ చేసింది. దీనికి తిరిగి రిప్లయ్ ఇచ్చిన ఆర్జీవీ ``యానిమల్ లో మీరు చూపించిన ఆత్మ గొప్పది .. చంపేస్తావని తెలుసు! అంటూ కొంత సెటైరికల్ గా రిప్లయ్ ఇచ్చారు. ట్రిప్తీ ఎలాంటి బోల్డ్ పాత్రకు అయినా సిద్ధమే అనేది ఆర్జీవీ ఉద్ధేశం. యానిమల్ లో రణబీర్ తో ఘాటైన రొమాన్స్ చేసిన ట్రిప్తి దిమ్రీ, ఆ తర్వాత బ్యాడ్ న్యూజ్ చిత్రంలోను గ్లామర్ ఎలివేషన్ లో తగ్గకుండా నటించింది. అందుకే ఇప్పుడు ఆర్జీవీతో పరాచికాలు ఆడుతూ నెటిజనులు స్పిరిట్ సినిమా యానిమల్ సీక్వెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే సందీప్ వంగా ఈ చిత్రం లో ప్రభాస్ ని పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా చూపిస్తున్నారని కథనాలొచ్చాయి. కంటెంట్ పరంగా అర్జున్ రెడ్డి, యానిమల్ తరహాలో రగ్గ్ డ్ గా హీరో పాత్రను చూపిస్తాడా? అన్నది వేచి చూడాలి.