Advertisementt

టీ షాప్ లో మినిస్టర్ లోకేష్ సందడి

Mon 26th May 2025 08:21 PM
nara lokesh  టీ షాప్ లో మినిస్టర్ లోకేష్ సందడి
Nara Lokesh Interaction with Tea Shop Owner టీ షాప్ లో మినిస్టర్ లోకేష్ సందడి
Advertisement
Ads by CJ

ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా చెప్పారు. కడప లో మూడురోజుల పాటు జరగబోయే మహానాడు కార్యక్రమ నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కొద్దిరోజులుగా టీడీపీ మహానాడు కోసం పలువురు నేతలు అక్కడే ఉండి మహానాడు నిర్వహణ పనులు చూసుకుంటున్నారు. టీడీపీ మహానాడుకు సీనియర్ నేతలు దగ్గర నుంచి కార్యకర్తలు, అభిమానులు వరకు అందరూ వేలాదిగా తరలి రానున్నారు. 

కడపలో రేపు మే 27 న మొదలు కానున్న మహానాడు కోసం మినిస్టర్ నారా లోకేష్ కుప్పం నుంచి కడపకు రోడ్డుమార్గంలో బయలు దేరి వెళ్లారు. ఆయనతో పాటు వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చారు. కుప్పం నుంచి కడపకు రోడ్డుమార్గంలో పయనిస్తున్న మంత్రి లోకేష్ శాంతిపురంలోని టీడీపీ కార్యకర్త చెంగాచారి టీకొట్టు వద్ద ఆగి అక్కడ టీ తాగడమే కాదు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లుగా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. 

మా నూతన గృహప్రవేశం సందర్భంగా చెంగాచారు నన్ను కలిశారు. ఇప్పుడు టీకొట్టు వద్ద నేను ప్రత్యక్షం కావడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వంలో తన టీ అంగడిని మూయించి ఇబ్బందులకు గురిచేశారని తెలుపగా... ఎవరికీ భయపడాల్సిన పనిలేదని.. తన వెంట నేనున్నానని భరోసా ఇచ్చాను. ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగాను.. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసారు. 

Nara Lokesh Interaction with Tea Shop Owner:

Minister Nara Lokesh Interaction with Tea Shop Owner

Tags:   NARA LOKESH
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ