ఈమధ్యన నూతన గృహాప్రవేశం, ఆతర్వాత కొడుకు ఒడుగు ఫంక్షన్ తో సోషల్ మీడియాలో హడావిడి చేసిన అనసూయ భరద్వాజ్ తాజాగా వదిలిన పిక్స్ చూస్తే మాత్రం ఏంటి అనసూయ ఈ అరాచకం అంటారేమో.. అలానే ఉంది ఆమె తాజా లుక్. ముక్కుకు ముక్కెర, దెయ్యం లా హెయిర్ స్టయిల్.. చీర కట్టి పిచ్చ పిచ్చగా ఇచ్చిన ఫోజులకి వామ్మో అనసూయ ఏంటి అవతారం అనాల్సిందే.
బ్లాక్ బ్లౌజ్, ఫ్లోరల్ ప్రింట్ శారీ, డార్క్ లిప్ స్టిక్ తో అనసూయ లుక్ నిజంగా డిఫ్రెంట్ గా ఉంది. రీసేంట్ గా ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం చేసి హోమం, సత్యన్నారాయణ వ్రతాలూ అవి పద్దతిగా చేసిన అనసూయ, కొద్దిరోజులకే కొడుకు ఒడుగు ఫంక్షన్ ని కూడా చాలా సాంప్రదాయంగా చేసింది. ప్రతి ఫంక్షన్ లోను సాంప్రదాయం ఉట్టిపడేలా అనసూయ చీరకట్టు కనబడింది.
కానీ బుల్లితెర షోస్ లో అనసూయ కనిపిస్తే అరాచకమే.. అన్నట్టుగా గ్లామర్ షో చేస్తుంది. స్టార్ మా లో అనసూయ జెడ్జి గా వస్తోన్న కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ షో కి అనసూయ ఇలా సారీ లో అరాచకంగా అతిగా తయారై వెళ్ళింది. ఆఫోటొస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.