మొట్టమొదటిసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ గత రెండు రోజులుగా తన డ్రెస్సింగ్ స్టయిల్, అలాగే అందాలతో చూపరుల మతి పోగొడుతుంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అదిరే డ్రెస్‌తో జాన్వీ కపూర్ మెరిసిపోతూ మెస్మరైజ్ చేస్తుంది.
కేన్స్‌లో తన తల్లితో జ్ఞాపకాలను జాన్వీ గుర్తు చేసుకుంది. తన తల్లి శ్రీదేవికి ఈ ప్రాంతమంటే చాలా ఇష్టమని.. ఆమె లేకుండా ఇక్కడికి రావడం ఎంతో బాధగా ఉందని చెప్పిన జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవిని ఎంతో మిస్ అవుతున్నట్లు చెప్పింది. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన హోమ్ బౌండ్ సినిమాను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ మూవీకి అతిథుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ ఈవెంట్ లో జాన్వీ కపూర్ రోజుకో డ్రెస్ తో అలరిస్తుంది. తాజాగా బ్యాక్ లెస్ డ్రెస్ అలాగే వైట్ డ్రెస్ లో అందాలు మాములుగా కాదు వేరే లెవల్లో ఆరబోస్తూ హాట్ ఫోజులతో అలరించింది.