డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయంలో పవన్ ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. కానీ నిర్మాతలు ఎలాగైనా సినిమాలను పూర్తి చేసి విడుదల చెయ్యాలని పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి తిరిగి ఒక్కొక్కరిగిగా సక్సెస్ అవుతున్నారు. అడువు ఎట్టకేలకు వీరమల్లు నిర్మాత సేఫ్ గా బయటపడ్డారు. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చెయ్యడంతో హడావిడిగా జూన్ 12 సినిమా విడుదల అని డేట్ అనౌన్స్ చేసారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ OG షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఏపీ క్యాబినెట్ సమావేశం పూర్తి కాగానే ఆయన OG ముంబై షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కుతారు. క్షణం తీరిక లేని పవన్ కళ్యాణ్ అటు మంత్రిగా పలు శాఖల బాధ్యతలు, ఇటు సినిమాల షూటింగ్ పూర్తి చేసే బాధ్యత తీసుకోవడమే గొప్ప విషయం.
మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీరమల్లు ప్రమోషన్స్ లో భాగమవుతారా, అసలు అది కుదురుతుందా, నిన్న బుధవారం పార్క్ హయత్ లో హరి హర వీరమల్లు సాంగ్ రిలీజ్ అనగానే అందరూ పవన్ కళ్యాణ్ వస్తారనే అనుకున్నారు, కానీ పవన్ రాలేదు. మరి మిగతా ప్రమోషన్స్ లో ఎక్కడైనా పవన్ కనిపిస్తారని ఆశించవచ్చా, లేదంటే వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏమైనా పవన్ వస్తారా, సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చెయ్యడమే నిర్మాతలకు ఊరటనిచ్చే విషయం.
పవన్ కళ్యాణ్ గనక సినిమా ప్రమోషన్స్ కి వస్తే సినిమాకి క్రేజ్ వస్తుంది. అది పవన్ చేస్తారా? చెయ్యగలరా? అనేది ఇప్పుడు సస్పెన్స్ అనే చెప్పాలి.