యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజుల క్రితం భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లని తీసుకుని బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం లండన్ వెళ్లారు. అక్కడే ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లోను రామ్ చరణ్ తో కలిసి సందడి చేసారు ఎన్టీఆర్. ఏప్రిల్ 22 న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ (డ్రాగన్ వర్కింగ్ టైటిల్) లో జాయిన్ అయిన ఎన్టీఆర్ రెండు వారాల పాటు కర్ణాటకలోనే ఉన్నారు.
డ్రాగన్ మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే ఎన్టీఆర్ ఫ్యామిలీ తో బర్త్ డే కి వెకేషన్ ట్రిప్ కి వెళ్లిపోయారు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కి డ్రాగన్ టీం సింపుల్ గా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పగా... వార్2 నుంచి టీజర్ వదిలారు మేకర్స్. ఇక బర్త్ డే సెలెబ్రేషన్స్ తర్వాత ఎన్టీఆర్ భార్య, పిల్లలతో కలిసి లండన్ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు.
ఈరోజు ఉదయమే ఎన్టీఆర్ తన కొడుకు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఎన్టీఆర్ పెద్దకొడుకు స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఇకపై ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి మూడో షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అన్నట్టు హిందీ లో ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2 టీజర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అసంతృప్తి కనిపిస్తుంది.