సినిమా- క్రికెట్ ప్రజలకు సమాంతరంగా వినోదాన్ని అందించే పరిశ్రమలు. ఆసక్తికరంగా ఈ రెండు రంగాలకు ఉన్న అవినాభావ సంబంధం ఎంతో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. క్రికెటర్లు కథానాయికలను ప్రేమించి పెళ్లాడటం రెగ్యులర్ గా చూస్తున్నది. ఇప్పుడు దీనికి రివర్సులో ఒక సినీహీరో క్రికెటర్ కుమర్తెను ప్రేమించాడు. కానీ ఇది వర్కవుట్ కాలేదు. దీనిపై ఇరు కుటుంబాలు కలిసి కూచుని మాట్లాడుకున్నాయి. పుకార్ల నేపథ్యంలో వారి మధ్య చర్చ సాగింది. కానీ చివరికి ఆ ప్రేమ పెళ్లి విఫలమైందని గుసగుస వినిపిస్తోంది.
జాతీయ మీడియా సమాచారం మేరకు.. బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, గల్లీబోయ్ ఫేం సిద్ధాంత్ చతుర్వేది, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ని ప్రేమించాడు. సిద్ధాంత్- సారా జంట కలిసి షికార్లు చేయడం మీడియా కంట పడింది. ఇది డేటింగా లేక స్నేహమేనా? అన్నదానిపై పూర్తి స్పష్ఠత లేదు. కానీ ఇంతలోనే ఏమైందో ఈ జంట పూర్తిగా విడిపోయిందని మీడియా కథనాలు ప్రచురించడం షాకిస్తోంది. సిద్ధాంత్ సడెన్ గా ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ ప్రచారం సాగుతోంది.
ఆ ఇద్దరి మధ్యా ఏమైందో కానీ, ఇది నిజంగా ఊహించనిది. సచిన్ టెండూల్కర్ నికర ఆస్తి విలువ 1250కోట్లు. టెండూల్కర్ ఫ్యామిలీ రేంజుకు సిద్ధాంత్ సరిపోతాడా? అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. అయితే అసలు సారా- సిద్ధాంత్ మధ్య డేటింగ్ నిజమా కాదా? అసలు ఈ బ్రేకప్ కేవలం పుకార్ మాత్రమేనా? అంటే దీనికి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే కదా క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకూ ఎవరూ స్పందించలేదు.