ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు భాగ్యశ్రీ బోర్సే. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్. అయినాసరే భాగ్యశ్రీ బోర్సే కి వరసగా వస్తోన్న అవకాశాలు ఆమెకి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఆమె చేసిన మొదటి చిత్రం మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తో పని లేకుండా భాగ్యశ్రీ బోర్సే కి అవకాశాలు రావడం మాములు విషయం కాదు.
ప్రస్తుతం వరస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న భాగ్యశ్రీ బోర్సే అందాలు, ఆమె గ్లామర్ విషయంలో ఆడియన్స్ మాత్రమే కాదు యంగ్ హీరోలు ఫిదా అవ్వబట్టే ఆమెకి వరసగా అవకాశాలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టీవ్ గా ఉండే ఆమె గ్లామర్ ఫొటోస్ వదులుతూ కవ్విస్తుంది.
తాజాగా బ్లూ మోడ్రెన్ డ్రెస్ లో భాగ్యశ్రీ బోర్సే షేర్ చేసిన పిక్స్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. లూజ్ హెయిర్ తో హద్దుదాటని అందాలతో భాగ్యశ్రీ బోర్సే సూపర్బ్ లుక్ లో కనిపించి యూత్ కి పిచ్చెక్కించింది. భాగ్యశ్రీ బోర్సే అందాలను ఆ విధంగా చూస్తే అవకాశాలు రాకుండా ఉంటాయా.. అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.