యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు వార్ 2 తో డెబ్యూ రెడీ చేసుకున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి బడా నిర్మాణ సంస్థ తో చేతులు కలిపిన ఎన్టీఆర్ మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వార్ కి సీక్వెల్ గా వార్ 2ని తెరకెక్కించారు. అయితే మొదటి నుంచి ఎన్టీఆర్ వార్ 2లో అతిధి పాత్ర చేస్తున్నారు, ఆర్.ఆర్.ఆర్ మాదిరి హీరోలిద్దరికి సమానమైన స్క్రీన్ స్పేస్ ఉండదు, హృతిక్ రోషన్ మెజారిటీ స్క్రీన్ స్పేస్ తీసుకుని ఎన్టీఆర్ కి అన్యాయం చేస్తారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎంతో టెన్షన్ కనిపించింది.
అందులో యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఎదుగుదలను తట్టుకోలేరు కాబట్టి వార్ 2 లో ఎన్టీఆర్ చిన్న రోల్ కే పరిమితమవుతారు, రాజమౌళి మాదిరి ఇద్దరి హీరోలకు స్క్రీన్ స్పేస్ ఇచ్చేంత సహృదయం బాలీవుడ్ మేకర్స్ కి ఉండదు, ఎన్టీఆర్ హిందీ డెబ్యూతోనే దెబ్బతింటాడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధనపడ్డారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎంతగా సరిపెట్టుకున్నా ఎన్టీఆర్ బర్త్ డే రోజున వచ్చిన వార్ 2 టీజర్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.
వార్ 2 నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కి వదిలిన టీజర్ ఎన్టీఆర్ కి స్పెషలా లేదా హృతిక్ కి స్పెషలా అనేది అర్ధం కావడం లేదు, ఎన్టీఆర్ కన్నా ఎక్కువగా హృతిక్ పవర్ ఫుల్ గా కనిపించారు, ఎన్టీఆర్ లుక్స్ డిజప్పాయింట్ చేసాయి. అసలు ఎన్టీఆర్ కోసం వదిలిన టీజర్ లో కియారా బికినీ షాట్ అవసరమా, ఎన్టీఆర్ వార్ 2 ఎందుకు ఒప్పుకున్నాడు, ఎన్టీఆర్ బర్త్ డే టీజర్ అంటే ఎలా ఉండాలి..
ఎన్టీఆర్ బర్త్ డే కి హృతిక్ రోషన్ వాయిస్ ఓవర్ తో టీజర్ కట్ ఉండాలి. హృతిక్ బర్త్ డే కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉండాలి. అంతేకాని.. ఒకరి బర్త్ డే టీజర్ లో మరొకరిని హైలెట్ చేస్తే ఎలా అంటూ నెటిజెన్స్ మాత్రమే కాదు, యాంటీ ఫ్యాన్స్ వార్ 2పై చేస్తున్న కామెంట్స్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. మొదటి నుంచి భయపడిందే జరిగింది అంటూ ఫ్యాన్స్ మధనపడిపోతున్నారు. టీజర్ కే ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.