హీరోయిన్ రాశి ఖన్నా ఇప్పుడు సౌత్ ని లైట్ తీసుకుందో, లేదంటే ఆమెకి అవకాశాలు కొరవడుతున్నాయో తెలియదు కానీ.. రాశి ఖన్నా ఎక్కువగా నార్త్ పైనే ఫోకస్ పెడుతుంది. అక్కడే అవకాశాలు వెతుక్కుంటుంది. తెలుగులో నితిన్ తో నటిస్తున్న తమ్ముడు చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. అటు హిందీలో ఫార్జి 2 వెబ్ సీరీస్ షూటింగ్ అయ్యింది.
రాజ్ అండ్ డీకే ద్వయం తెరకెక్కించిన ఫార్జి వెబ్ సీరీస్ హిట్ అవగా దానికి పార్ట్ 2 ఉంటుంది అని ప్రకటించారు. షాహిద్ కపూర్-విజయ్ సేతుపతి కలయికలో రాశి ఖన్నా జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన ఫార్జి వెబ్ సీరీస్ కి సీక్వెల్ గా పార్ట్ 2 షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. అయితే ఈ షూటింగ్ లో రాశి ఖన్నా గాయపడినట్లుగా తెలుస్తుంది.
తనకు ప్రమాదం జరిగిన ఫొటోస్ ని రాశి ఖన్నానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో రాశీ ఖన్నా తన ముక్కు నుంచి రక్తం కారుతుంది. అలాగే, రాశీ ఖన్నా కాళ్లకు, చేతులకు కూడా దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఉంది. ఫార్జి సీరీస్ షూటింగ్‌లో రిస్కీ యాక్షన్ సీన్స్‌లో రాశీ ఖన్నా పాల్గొన్నప్పుడే ఆమెకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.