బ్రహ్మానందం, ఒడివేలు తర్వాత భారీ ఆర్జించిన కమెడియన్ అతడు. తనదైన హాస్య చతురతతో బుల్లితెర వీక్షకుల మనసులు గెలుచుకున్న కమెడియన్ కపిల్ శర్మ నెలకు 3 కోట్లు ఆర్జించే పనిమంతుడు అని ఎందరికి తెలుసు? అతడు ఒక ఏడాదికి 35 కోట్లు సంపాదిస్తాడని జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కపిల్ ఇప్పటికే 280 కోట్ల ఆస్తులను కూడగట్టాడు. భారతదేశంలోని అత్యంత ధనిక కమెడియన్లలో ఒకరిగా స్థానం సంపాదించారు. నెట్ ఫ్లిక్స్, స్టార్ చానెల్స్ సహా పలు బడా సంస్థలతో అతడు కలిసి పని చేస్తున్నాడు.
కపిల్ జీవితం రూ.300 జీతంతో మొదలైంది. కానీ ఇంత పెద్ద ఆస్తికి ఓనర్ ఎలా అయ్యాడు? అంటే దానికోసం అతడు రేయింబవళ్లు శ్రమించాడు. స్టార్ డమ్ ఒక్కరాత్రిలో వచ్చింది కాదు. `ది గ్రేట్ ఇండియన్ కపిల్` షో తో అతడి దశ దిశ తిరిగిపోయాయి. కపిల్ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఇంటర్వ్యూలు చేసే స్టార్ హోస్ట్.
అయితే కపిల్ ఎప్పుడూ ఇండస్ట్రీ పార్టీల్లో పెద్దగా కనిపించడు. తాను రిజర్వుడ్ పర్సన్ అని చెబుతాడు. ఇక తన సహచర కమెడియన్ అర్చన పురాణ్ సింగ్ కూడా కపిల్ ఎంతో రిజర్వ్డ్ అనే విషయాన్ని వెల్లడించారు.