కోలీవుడ్ హీరో విశాల్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నారు. ఆయన వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమాయణం నడపడం తర్వాత బ్రేకప్ అవ్వడం, ఆతర్వాత అనీషా రెడ్డిని విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం అది కూడా బ్రేకప్ అవడం, మధ్యలో నటి అభినయని విశాల్ వివాహం చేసుకోవబోతున్నారనే వార్తలు వినిపించడం, అభినయ తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే.
తాజాగా విశాల్ పెళ్లి మరోమారు హాట్ టాపిక్ అయ్యింది. విశాల్ హీరోయిన్ సాయి ధన్సిక ను వివాహం చేసుకోబోతున్నాడనే వార్త వైరల్ అయ్యి కూర్చుంది. ఈమధ్యన అనారోగ్యంతో విశాల్ ఇబ్బంది పడి కోలుకోవడం, రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కళ్ళు తిరిగిపోవడం ఆతర్వాత ఆయన టీం విశాల్ హెల్త్ పై క్లారిటీ ఇవ్వడం చూసాం. ఇప్పుడు తాజాగా విశాల్ పెళ్లి మేటర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కేవలం రూమర్స్ కాదు విశాల్-సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెన్నై లో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రకటించారు. సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి. మేము కలిసి అద్భుతమైన లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నాం, పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుంది అని విశాల్ చెప్పడమే కాదు ఆగష్టు 29 న వివాహం చేసుకోబోతున్నట్టుగా ప్రకటించారు.
సాయి ధన్సిక విశాల్ తో ప్రేమ విషయమై స్పందిస్తూ.. కొద్ధికాలం మాకు నుంచి పరిచయం ఉంది, అది ప్రేమగా మారింది, విశాల్ ఎప్పుడు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటాను అంటూ సాయి ధన్సిక పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది.