ఎన్టీఆర్ బర్త్ డే కి ప్రశాంత్ నీల్ మూవీ నుంచ్చి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు అని మేకర్స్ అభిమానులను డిజప్పాయింట్ చేసారు. కారణం ఎన్టీఆర్ హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న వార్ 2 నుంచి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. అది ఒక్కటే హైలెట్ అవ్వాలి, ఎన్టీఆర్ హిందీ డెబ్యూపై అంచనాలు పెరగాలని ప్రశాంత్ నీల్ తన సినిమా ట్రీట్ ఆపేసారు.
ప్రశాంత్ నీల్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కి స్పెషల్ గ్లింప్స్ వస్తాయని ఆశపడిన ఎన్టీఆర్ అభిమానులకు మేకర్స్ డిజప్పాయింట్ చేసే వార్త అందించారు. ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రెస్ లేని దేవర 2 నుంచి కూడా ఎన్టీఆర్ బర్త్ డే కి స్పెషల్ సర్ ప్రైజ్ ఉండకపోవచ్చని అంటున్నారు.
ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ నుంచే అప్ డేట్ లేనప్పుడు కొరటాల శివ మాత్రం దేవర 2 స్పెషల్ ట్రీట్ ఎలా ఇస్తారు, సో దేవర 2 విషయంలో కూడా లైట్ తీసుకోండి ఫ్యాన్స్.. అంటూ చాలామంది మాట్లాడుకోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలు మీద నీళ్లు చల్లేలా చేసింది.