మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. కన్నప్ప లో పాన్ ఇండియా స్టార్స్, పలు భాషల స్టార్స్ భాగమవడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కించిన కన్నప్ప ను మంచి విష్ణు శక్తిమేర ప్రమోట్ చేస్తున్నాడు. కన్నప్ప పై చాలామంది ద్వేషం చూపిస్తూ, సినిమా ఎలా ఉంటుందో తెలియకుండానే సెన్సార్ బోర్డు కి ఫిర్యాదు చేస్తున్నారు అంటూ మంచు విష్ణు సన్సేషనల్ కామెంట్స్ చేసారు.
ఈమధ్యన మా ఫ్యామిలిలో ఎదురైన పరిస్థితులకి చాలా బాధపడ్డాను, బాధ అనేది చాలా చిన్న పదమే, ప్రెజెంట్ నేను మా నాన్నగారి సంతోషం గురించే ఆలోచిస్తున్నాను, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు. నేను ఆయనకు మంచి పేరు తీసుకురాకపోయినా చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదు, ఒకవేళ అలా జరిగితే ఆ రోజే చచ్చిపోయినవాడి కింద లెక్క.. అంటూ మంచి విష్ణు ఎమోషనల్ అయ్యారు.
ఇక కన్నప్పలో స్పెషల్ రోల్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి విష్ణు మట్లాడుతూ.. నేను ప్రభాస్ చాలా క్లోజ్, అతనెంత గొప్ప నటుడో అతనికి కూడా తెలియదు. కెరీర్ స్టార్టింగ్ లో అందరూ సింపుల్ గానే ఉంటారు. కానీ స్టార్ స్టేటస్ వచ్చాక కేసుల అంతే సింపుల్ గా ఉండడం ప్రభాస్ కే సాధ్యం. అది ప్రభాస్ గొప్పదనం.
మేము ఎప్పటికి బ్రదర్స్. బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్లే నా పతనాన్ని కోరుకుంటున్నారు. నేను ప్రభాస్ రక్తం పంచుకుని పుట్టకపోయినా నా మంచి కోరుకుంటున్నాడు, అతనికి ఎప్పటికి రుణపడి ఉంటాను, ప్రభాస్ సింపుల్ సిటీ అంటే చాలా ఇష్టం, అంటూ మంచు విష్ణు ప్రభాస్ గురించి చెప్పుకొచ్చాడు.