ఒక్కొక్కటిగా అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ఇచ్చుకుంటూ పోతున్నాయి. కానీ మెగాస్టార్ విశ్వంభర, ప్రభాస్ రాజా సాబ్ చిత్రాల విడుదల తేదీలు మాత్రం ఇవ్వడం లేదు, వాటి విడుదల తేదీల కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. మేకర్స్ వాటిని ఇవ్వకుండా అంతగా వెయిట్ చేయిస్తున్నారు.
విశ్వంభర నుంచి మొదటి సాంగ్ రామ రామ పెద్ద హిట్ అయ్యింది, ఇప్పటికి ఆ పాట ట్రెండింగ్ లోనే ఉంది.. దానితో విశ్వంభర రిలీజ్ తేదీని దర్శకుడు వసిష్ఠ మంచి ముహూర్తం చూసుకుని అనౌన్స్ చేస్తారని భావించారు. కానీ వసిష్ఠ విశ్వంభర వీఎఫెక్స్ పై దృష్టి పెట్టడంతో ఇటు మేకర్స్ విశ్వంభర రిలీజ్ తేదీని పక్కన పెట్టారు.
జనవరి నుంచి పోస్ట్ పోన్ అయిన విశ్వంభర ఎప్పుడు విడుదలవుతుందో తెలియక మెగా ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. మరోపక్క ఈ నెలలో వచ్చే హనుమజ్జయంతి రోజున విశ్వంభర రిలీజ్ తేదీని మేకర్స్ అనౌన్స్ చేస్తారనే టాక్ వినబడుతుంది. మే 22 న హనుమాన్ జయంతి రోజున చిరు సెంటిమెంట్ గా విశ్వంభర రిలీజ్ తేదీని మేకర్స్ చేత ఇప్పిస్తారని అంటున్నారు. చూద్దాం అందులో నిజమెంతుందో అనేది.!