కళ్యాణ్ రామ్-సీనియర్ హీరోయిన్ విజయశాంతి కలయికలో మదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో తెరకెక్కి భారీ అంచనాలు అనేకన్నా ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ తో సినిమాపై నమ్మకాన్ని చూపించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏప్రిల్ 18 న థియేటర్స్ లో విడుదలైంది. కానీ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో తడబడింది.
ఇక ఈ చిత్రం మే 20 తర్వాతే ఓటీటీలోకి వస్తుంది అని అందరూ భావించారు. కానీ మూడు వారాలు తిరిగేలోపే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అమెజాన్ ప్రైమ్ లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది.
గత వారం నుంచే రెంట్ పద్దతిలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అమెజాన్ ప్రైమ్ లో నుంచి అందుబాటులోకి రాగా.. ఇప్పుడు అంటే ఈరోజు శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సైలెంట్ గా స్ట్రీమింగ్ లోకి రావడం మాత్రం అందరికి షాకిచ్చింది. ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ సినిమా విడుదలై నెల గడవకముందే ఇలా ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి రావడం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే.