రామ్ పోతినేని కొత్త చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. టైటిల్ ట్రెండీ గా ఉంది, రామ్ లుక్స్ సూపర్ గా ఉన్నాయి, ఆంధ్ర కింగ్ తాలూకా గ్లింప్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ అభిమానులు అనే కంటే మూవీ లవర్స్ మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకా విషయంలో అసంతృప్తిగా కనిపించడం ఆశ్చర్యకర విషయం.
కారణమేమిటంటే టాలీవుడ్ లో చాలామంది హీరోలను వదిలేసి రామ్ చిత్రం కోసం కన్నడ హీరో ఉపేంద్ర ను తీసుకొచ్చి బ్యానర్ కట్టి రామ్ ని అభిమానిగా మార్చి ఆంధ్ర కింగ్ తాలూకా అనిపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఆంధ్ర కింగ్ తాలూకాలో ఉపేంద్రను కాకుండా మరో తెలుగు హీరోని పెడితే బావుండేదని ట్వీట్లు వేస్తున్నారు.
సినిమాకి టైటిల్ ఆంధ్ర కింగ్ అని పెట్టారు, బాగుంది! కింగ్ రోల్ ని తెలుగు హీరోలైన నాగార్జున లాంటోళ్ళకిస్తే ఇంకా బాగుండేది కానీ ఉపేంద్ర ని పెట్టి డిజప్పాయింట్ చేసారు అనేది వాళ్ళ ఉద్దేశ్యం. మరి దర్శకుడు మహేష్ ఏం అలోచించి ఉపేంద్రను పట్టుకొచ్చాడో సినిమా చూస్తే కానీ తెలియదు.