Advertisementt

షాకింగ్: రేవంత్ రెడ్డి పక్కన నాగార్జున

Wed 14th May 2025 10:49 AM
nagarjuna  షాకింగ్: రేవంత్ రెడ్డి పక్కన నాగార్జున
Revanth Reddy and Nagarjuna Sit Side-by-Side at Banquet షాకింగ్: రేవంత్ రెడ్డి పక్కన నాగార్జున
Advertisement
Ads by CJ

తెలంగాణాలో బీఆరెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పదేళ్లు సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే కాదు, అటు బీఆరెస్ ప్రభుత్వం కూడా సినీ హీరోలతో తత్సంబందాలు కలిగి ఉంది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక సినీ ఇండస్ట్రీపై ఆయన ఓ చిన్నపాటి యుద్ధం ప్రకటించారు. అందులో భాగంగా హైడ్రా కింగ్ నాగార్జున N కన్వెన్షన్ ని కూల్చివేయడం, ఇంకా చాలా సందర్భాల్లో సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ ప్రభుత్వం వార్ ప్రకటించింది. 

నాగార్జున తన దగ్గర హై కోర్టు స్టే ఉంది అని చెప్పినా హైడ్రా కూల్చివేతలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. దానితో సినిమా ఇండస్ట్రీ vs రేవంత్ రెడ్డి సర్కార్ గా మారిపోయింది వ్యవహారం. ఆ తర్వాత నాగార్జున రేవంత్ సర్కార్ తో ఆంటీ ముట్టనట్టుగా ఉంటారని అనుకుంటే నాగార్జున తెలంగాణ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర గా మారి షాకిచ్చారు. అంతేకాదు ఇండ‌స్ట్రీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో నాగార్జున పాల్గొని ముఖ్య‌మంత్రిని శాలువాతో స‌త్క‌రించారు. ఫొటోల‌కు న‌వ్వుతూ ఫోజులు ఇచ్చారు. ఇక అప్పుడే వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ తొల‌గిపోయిన‌ట్టు అనిపించింది.

ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి-నాగ్ కలయిక హైలెట్ అయ్యింది. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో నాగార్జున కనిపించడమే కాదు రేవంత్, నాగ్ ఒకే టేబుల్ ద‌గ్గ‌ర కూర్చుని విందు ఆర‌గించిన వీడియోస్ వైరల్ గా మారాయి. అది చూసి నాగార్జున-రేవంత్ రెడ్డి మద్యన ఏమి లేదు, వారు స్నేహంగానే ఉన్నారు, నాగ్ కూడా రేవంత్ రెడ్డిపై ఎలాంటి కోపం పెట్టుకోలేదు, స్నేహపూర్వకంగానే ఉంటున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. 

కానీ కొంతమంది నాగ్ తన విలువైన ఆస్తులను పాడు చేసిన రేవంత్ రెడ్డిపై కోపం ఉండాలి కానీ, ఇలా దాసోహం అవ్వకూడదు, ఇలా కలిసి కనిపించడం మాత్రం నిజంగా షాకింకే అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Revanth Reddy and Nagarjuna Sit Side-by-Side at Banquet:

Revanth Reddy and Nagarjuna Sit Side-by-Side at Banquet for Miss World Contestants

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ