అధికారం కోల్పోయి ఏడాది తిరగకముందే జగన్ కి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. అధికారం పోయాక తన చుట్టూ ఉన్న నేతలు కూడా జగన్ ని మోసం చేస్తున్నారు. ఒక్కొక్కరిగా జగన్ కి, వైసీపీ పార్టీ కి దూరమవుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ కి ఉన్న ఎమ్యెల్సీ లు వరసగా రాజీనామా చేసి కూటమి ప్రభుత్వ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జగన్ కి మరో వైసీపీ ఎమ్యెల్సీ టాటా బై బై చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ పార్టీలో ఉండేందుకు ఏ ఒక్క నేత ఇష్టపడడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా మండలి చైర్మన్‌కు ఆమె పంపించారు. జకియా ఖానంను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
గత రెండేళ్లుగా జకియా ఖానం వైసీపీ పార్టీ నుంచి దూరం జరగడమే కాదు గతంలో లోకేష్ కి శాలువా కప్పి సత్కరించడం తో ఆమె టీడీపీ లోకి వెళుతుంది అనుకున్నారు. ఇప్పుడు జకియా ఖానం వైసీపీ పార్టీకి, జగన్ కి బై బై చెప్పి వెళ్లిపోవడం జగన్ కి ఎదురు దెబ్బె అని చెప్పాలి.