ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో అందరి కన్నా ఎక్కువ క్రేజ్, ఎక్కువ హిట్స్ తో ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ. మెగాస్టార్ వరస సినిమాలు చేస్తున్నారు. కానీ వరస హిట్స్ పడడం లేదు. నాగార్జున సోలో హీరోగా బిగ్ బ్రేక్ ఇచ్చారు. వెంకీ సంక్రాంతికి వస్తున్నాం తో హిట్ కొట్టారు. కానీ తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
బాలయ్య మాత్రం ఒక సినిమాని విడుదల చెయ్యడానికి ముందే మరో సినిమాని సెట్ మీదకి తీసుకెళ్లిపోతున్నారు. ఈ ఏడాది డాకు మహారాజ్ విడుదల చేసిన బాలయ్య ఇదే ఏడాది అఖండ 2 ని విడుదల చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలా బాలయ్య ప్లానింగ్ సూపర్ గా ఉండడమే కాదు, విజయాలు ఆయన నుంచి జరగడం లేదు.
ఇప్పుడు బాలయ్య కోలీవుడ్ లోకి వెళ్ళబోతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 లో బాలయ్య గెస్ట్ రోల్ లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ ఉంది. జైలర్ 2 లో బాలయ్య నటిస్తునందుకు గాను మేకర్స్ ఆయనకు కళ్ళు చెదిరే కాదు రికార్డు స్థాయి పారితోషికం ఇస్తున్నారట.
ఇప్పుడు వరకు ఏ హీరో గెస్ట్ రోల్ కి అందుకోని విధంగా బాలయ్య జైలర్ 2 కోసం పారితోషికం అందుకోబోతున్నారట. దాదాపుగా బాలకృష్ణ కు 50 కోట్ల పారితోషికం జైలర్ 2కి ఇచ్చేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారనే మాట సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, అది చూసి ఇది కదా మా బాలయ్య రేంజ్ అంటూ నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.