నిన్నటివరకు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ ఫినిష్ అవ్వని కారణంగా ఆ సినిమా రిలీజ్ తేదీలు తరచూ వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసేసిన పవన్ కళ్యాణ్ ఇకపై OG కోసం డేట్స్ కేటాయించడమే కాదు, ఈ వారంలోనే ఆయన OG సెట్ లోకి వెళ్ళబోతున్నారు.
OG షూటింగ్ కూడా నిన్న సోమవారం నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఓ 14 నుంచి 15 రోజుల పాటు డేట్స్ కేటాయిస్తే OG షూటింగ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తవుతుంది, విలన్ కేరెక్టర్ ఇమ్రాన్ హష్మీ, పవన్ నడుమ యాక్షన్ పార్ట్ పూర్తయితే OG ఓ కొలిక్కి వచ్ఛినట్టే అని తెలుస్తుంది.
మరి OG షూటింగ్ కూడా పవన్ కంప్లీట్ చేస్తే సెప్టెంబర్లో OG విడుదల ఉండినా ఉండొచ్చనే న్యూస్ చూసిన వారు పవన్ ఫ్యాన్స్ ఇక OG పై బెంగ పెట్టుకోకండి, సెలెబ్రేషన్స్ కి సిద్దమైపొండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.