సినీ ప్రముఖులైనా, రాజకీయనాయకులైనా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించాలన్నా, లేదంటే కొత్త వెహికల్ నెంబర్ తమ పేరు పై తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిందే. రీసెంట్ గా రాజమౌళి అలాగే బాలకృష్ణ లాంటి సినీ ప్రముఖులు హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.
తాజాగా అక్కినేని నాగార్జున తన ఆర్టీఏ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడానికి ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఆయన పర్సనల్ గా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి, అక్కడ అధికారులు సూచించిన మేరకు తన ఫొటోను అందించడంతో పాటు, సంబంధిత పత్రాలపై సంతకం చేశారు.
ఇక నాగార్జున ను చూసి ఆర్డీఏ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఆయనతో ఫొటోస్ దిగేందుకు ఇంట్రెరెస్ట్ చూపించగా నాగార్జున వారితో ఫొటోస్ దిగారు.