ఏప్రిల్ 18 న థియేటర్స్ లో విడుదలైన కళ్యాణ్ రామ్-విజయశాంతి ల అర్జున్ సన్నాఫ్ వైజయంతి సడన్ గా అంటే మూడు వారాలు కూడా పూర్తి కాకముందే ఓటీటీలో ప్రత్యక్షమవడంపై ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మంచి అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది.
కళ్యాణ్ రామ్-విజయశాంతి పెట్టుకున్న నమ్మకాన్ని అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రూవ్ చెయ్యలేకపోయింది. తల్లి కొడుకు ఎమోషన్స్ నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రంపై ఓటీటీ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి మొదలైంది.
కానీ ఇప్పుడు అసలు ఎలాంటి చప్పుడు లేకుండా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే ఈ మూవీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కేవలం యూకేలో ఉన్నవాళ్లకి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా అద్దె విధానంలో మాత్రమే వీక్షించే వెసులుబాటు ఉంది.
మరో ఐదు రోజుల్లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ నుంచి ఫ్రీగా చూసే అవకాశం ఉంది. కానీ మూడు వారాల్లోగా ఇలా ఇలా అద్దె విధానాల్లో ఓటీటీలోకి రావడంపై ప్రేక్షకులు షాకవుతున్నారు.