Advertisementt

లండన్ లో అదరగొట్టేసిన ఎన్టీఆర్-చరణ్

Mon 12th May 2025 08:56 AM
ntr  లండన్ లో అదరగొట్టేసిన ఎన్టీఆర్-చరణ్
NTR-Charan making waves in London లండన్ లో అదరగొట్టేసిన ఎన్టీఆర్-చరణ్
Advertisement
Ads by CJ

మూడేళ్లయినా ఆర్.ఆర్.ఆర్ హవా ఇంకా తగ్గలేదు. ఇప్పటికి ఆర్.ఆర్.ఆర్ విషయంలో దర్శకుడు రాజమౌళి ఏదో ఒక చోట ఏదో ఒక విషయంలో హైలెట్ చేస్తూనే ఉన్నారు. నాటు నాటు సాంగ్ కి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం లండన్‌లోని చారిత్రాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో నిన్న జరిగిన లైవ్ కాన్సర్ట్‌తో మరో సంచలనం సృష్టించింది. 

ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి ఏ వేడుకకైనా ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి కనిపించడమే కాదు, వారి మద్యన ఉన్న స్నేహ బంధాన్ని చూపించడం ప్రతిసారి హైలెట్ అవ్వడం, అభిమానుల నుంచి ప్రశంశలు అందుకోవడం అనేది పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా లండన్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్ ల బాండింగ్ చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. 

ఇంకా ఈ వేడుకలో రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్ కాన్సర్ట్ ప్రదర్శన పొందిన రెండో భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది.

NTR-Charan making waves in London:

Jr NTR and Ram Charan will attend the RRR live in concert screening at the Royal Albert Hall 

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ