Advertisementt

నారీ నారీ న‌డుమ జ‌యం ర‌వి కింక‌ర్త‌వ్యం?

Sun 11th May 2025 09:12 PM
jayam ravi  నారీ నారీ న‌డుమ జ‌యం ర‌వి కింక‌ర్త‌వ్యం?
Jayam Ravi Divorce Drama: Ex-Wife Slams, GF Fires Backhaa నారీ నారీ న‌డుమ జ‌యం ర‌వి కింక‌ర్త‌వ్యం?
Advertisement
Ads by CJ

కోలీవుడ్ టాలీవుడ్ లో పేరున్న హీరో జ‌యం ర‌వి. ఇటీవ‌లి కాలంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించాడు. కానీ సోలో హీరోగా అత‌డి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. త‌న‌కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా జ‌యం ర‌వి కెరీర్ ని డోఖా లేకుండా న‌డిపించ‌వ‌చ్చు. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. దీనికి కార‌ణం భార్య‌తో ట్ర‌బుల్స్. వ్య‌క్తిగ‌త జీవితంలో ప‌రిణామాలు అత‌డి కెరీర్ ని డైలమాలో దించాయి. ప్ర‌స్తుతం భార్య ఆర్తితో జ‌యం ర‌వి కోర్టు బ్యాటిల్ ముగియ‌లేదు.

గ‌తంలో భార్య‌కు విడాకులిస్తున్నాన‌ని జ‌యం ర‌వి ప్ర‌క‌టించాడు. కానీ ఈ వివాదం ఇంకా ముగియ‌లేదు. ఇప్ప‌టికీ కోర్టు విడాకులు మంజూరు చేయ‌లేదు. అయితే విడాకులు మంజూరు అవ్వ‌కుండానే అత‌డు కెనీషా అనే గాయ‌ని కం డాక్ట‌ర్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడ‌ని భార్య ఆర్తి ఆరోపిస్తోంది. ఇలాంటి వివాదం న‌డుస్తుండ‌గానే, జ‌యం ర‌వి అక‌స్మాత్తుగా చెన్నైలో జ‌రిగిన పెళ్లిలో కెనీషాతో ప‌బ్లిగ్గా క‌నిపించాడు. విందులో ఎంతో స‌ర‌దాగా ఆమెతో క‌లిసి సంద‌డి చేయ‌డంతో దానిని త‌ట్టుకోలేని ఆర్తి, సోష‌ల్ మీడియాలో సుదీర్ఘ నోట్ రాసారు.

ఇంకా కోర్టులో విడాకులు మంజూరు కాకుండానే అత‌డు ఇలా వేరొక‌రితో షికార్ చేస్తున్నాడ‌ని ఆమె ఆరోపించారు. తండ్రిగా ఇద్ద‌రు పిల్ల‌ల బాధ్య‌త‌ల్ని అత‌డు తీసుకోలేద‌ని, పిల్ల‌ల‌ను విస్మ‌రించాడ‌ని ఆర్తి తీవ్రంగా క‌లత‌కు గుర‌య్యారు. ఓవైపు భార్య ఆవేద‌న చెందుతున్నా జ‌యం ర‌వి అదేమీ ప‌ట్ట‌న‌ట్టు, విందు త‌ర్వాత మ‌రోసారి కెనీషాతో ప‌బ్లిగ్గా క‌నిపించాడు. ప‌దే ప‌దే కావాల‌నే అత‌డు భార్య ఆర్తిని టీజ్ చేస్తున్నాడు. దీంతో ఆర్తికి మ‌ద్ధ‌తుగా సీనియ‌ర్ న‌టీమ‌ణులు ఖుష్బూ సుంద‌ర్, రాధిక శ‌ర‌త్ కుమార్ వంటి వారు ధైర్యం నూరి పోస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఎంతో బ‌లంగా ఉండాల‌ని ఆ ఇద్ద‌రూ సోష‌ల్ మీడియ‌ల్లో ఆర్తికి బాస‌ట‌గా నిలవ‌డం కోలీవుడ్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

Jayam Ravi Divorce Drama: Ex-Wife Slams, GF Fires Backhaa :

Jayam Ravi made his first public appearance with his girlfriend Kenisha

Tags:   JAYAM RAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ