నటసింహ నందమూరి బాలకృష్ణ గతంలో స్టేజ్ పై పాటలు పాడిన విషయం మనకు తెలిసిందే. సంస్కృత శ్లోకాలను కూడా ఆయనెంత స్పష్టంగా పలుకుతారో అభిమానులకి అర్ధమైన విషయమే. తాను ఎంతోగానో ఆరాధించే తన తండ్రి గారి శివశంకరీ శివానందలహరి పాట ను స్టేజ్ పైనే ఆలపించిన బాలయ్య, లెజెండ్ సాంగ్ ని స్టేజ్ పై పలుమార్లు ఆలపించారు. కానీ వెండితెరపై ఎప్పుడు చెయ్యలేదు. బట్ అది ఇప్పుడు జరగబోతుంది.
ఈ లీడ్ లో ఇప్పటికే చిరంజీవి మాస్టర్ లో తమ్ముడు సాంగ్, మృగరాజ్ లో టీ సాంగ్ ఆలపించారు. నాగార్జున సీతారామరాజు లో సిగరెట్ సాంగ్, నిర్మల కాన్వెంట్ లోను మరో సాంగ్ పాడారు.. అంతేకాదు సోగ్గాడే చిన్ని నాయన లో శృతి కలిపారు. ఇక వెంకటేష్ విషయానికొస్తే గురు సినిమాలో జింగిడి జింగిడి సాంగ్ పాడిన వెంకటేష్ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో టైటిల్ సాంగ్ పాడేసి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పటివరకు ఈ లీడ్ లోకి ఎంటర్ కానీ బాలకృష్ణ ఇప్పుడు ఇది కూడా ఫుల్ ఫీల్ చెయ్యబోతున్నారు.
అఖండ 2 లో బాలయ్య చెయ్యబోతున్న పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో, తను పలికే ప్రతి పదం అంతే పదునుగా ఉంటుంది. ఓ పర్టిక్యులర్ సిట్యువేషన్ లో బాలయ్య చెప్పే శ్లోకం లాంటి పాట స్వయంగా ఆయన గాత్రంతోనే రికార్డ్ చేయించారు బోయపాటి, అది నిజంగా వింటుంటేనే గూస్ బంప్స్ వస్తుంది అనేది యూనిట్ వర్గాల రిపోర్ట్. ఇక రేపు థియేటర్స్ లో ఉంటుందమ్మా జై బాలయ్య నినాదాలతో మరు మోగిపోవడమే.