మంచు విష్ణు కన్నప్ప పైకి తాను నటించిన భైరవం చిత్రాన్ని విడుదల చేస్తాను, సినిమా తోనే మాట్లాడతాను, కన్నప్ప దొంగప్ప అంటూ మంచు మనోజ్ మంచు విష్ణు తో ఉన్న వ్యక్తిగత వ్యవహారాలపై కామెంట్స్ చేసాడు. మంచు విష్ణు కన్నప్ప ఎప్పుడు విడుదలైతే అప్పుడే తన భైరవం చిత్రాన్ని విడుదల చేస్తా అంటూ మీడియాలో సవాల్ చేసాడు.
కానీ కన్నప్ప ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ జూన్ 27 విడుదల అని కొత్త తేదీ ఇచ్చారు, దానితో మంచు మనోజ్ భైరవం ఎప్పుడు విడుదల చేస్తాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. తాజాగా మంచు విష్ణు తో వైరాన్ని మనోజ్ పక్కనపెట్టాడు. అందుకే తాను నటించిన మినీ మల్టీస్టారర్ భైరవం చిత్రానికి కొత్త తేదీ ఇచ్చారు.
ఈ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భైరవం విడుదల కాబోతోంది అని మేకర్స్ ప్రకటించారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ కలర్ఫుల్ ఫెస్టివల్ వైబ్ తో కనిపించిన భైరవం రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.