Advertisementt

ఇండియా-పాక్ వార్ మధ్యలో బలూచిస్తాన్

Fri 09th May 2025 11:01 AM
balochistan  ఇండియా-పాక్ వార్ మధ్యలో బలూచిస్తాన్
Balochistan Liberation Army claims killing of 14 Pakistan soldiers ఇండియా-పాక్ వార్ మధ్యలో బలూచిస్తాన్
Advertisement
Ads by CJ

పహల్గమ్ దాడులకు నిరసనగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. ఆపరేషన్ సిందూర్ పేరుతొ పాక్ పై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. ఈ దాడిలో పాకిస్తాన్ పౌరులతో పాటుగా ఉగ్రవాద నాయకుడు మృతి చెందడంతో ఆగ్రహంతో పాకిస్తాన్ ఇండియా సరిహద్దు పై డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను ప్రయోగించింది.  

వారిని భారత మిలటరీ దళాలు చాకచక్యంగా తిప్పి కొట్టాయి. పాక్ దాడులకు ప్రతీకారంగా కౌంటర్ ఎంటాక్స్ స్టార్ట్ చేసింది భారత్. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇండియా-పాక్ నడుమ తీవ్రస్థాయి యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యంపై విరుచుకుపడింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ దాడిలో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ పౌరులు  మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 

ఈ దాడి తర్వాత బలుచిస్తాన్ నుంచి పాక్ ఆర్మీని తరిమికొట్టి.. క్వెట్టా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది పాక్ సైన్యానికి షాకిచ్చింది. బలూచీ తిరుగుబాటుదారులు క్వేట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విధంగా ఇండియా-పాక్ మధ్యలోకి బలూచిస్తాన్ ఎంటర్ అవడమే కాదు సక్సెస్ ఫుల్ గా దాడులను ముగించి క్వెట్టా నగరాన్ని స్వాధీనంలోకి తీసుకోవడం పాకిస్తాన్ కి అత్తో పెద్ద దెబ్బే. 

Balochistan Liberation Army claims killing of 14 Pakistan soldiers:

14 Pakistani soldiers killed in twin attacks in Balochistan

Tags:   BALOCHISTAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ