బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరో రణవీర్ ని ప్రేమించి పెళ్లాడింది. 2018 లో వివాహం చేసుకున్న ఈ జంట 2024 లో ఓ పాపకు జన్మనిచ్చారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత తల్లితండ్రులైన దీపికా-రణవీర్ లు తమ పాప కు దువా అని పేరు పెట్టారు, ప్రస్తుతం ఈ జంట తమ కూతురు తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
తాజాగా దీపికా పదుకొనె మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నాను, పిల్లలను కనే విషయంలో నాకు నా భర్త ఫుల్ సపోర్ట్ చేసాడు, పెళ్లి తర్వాత కొద్దిరోజులకే పిల్లలను కనే విషయం ఎలా ప్లాన్ చేద్దాం అని నేను అడిగితే, పిల్లలని కనడం ఇద్దరి నిర్ణయం అయినప్పటికి, బేబీ ని మోసేది నువ్వు, నీ శరీరంలోనే బేబీ పెరుగుతుంది. కాబట్టి నువ్వే డెసిషన్ తీసుకోవాలి, పిల్లలను కనగలను అని నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్లాన్ చేద్దామని అన్నాడు, రణవీర్ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి.
ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు చివరి ఎనిమిది, తొమ్మిది నెలలు ఎంతో కష్టంగా అనిపించింది. కానీ నా చుట్టూ నా రిలేటివ్స్, అక్క, చెల్లు, ఇలా అందరూ నా వెన్నంటే ఉన్నారు. ఇక నా కుతూరుకి పేరు పెట్టే విషయంలో తొందర పడలేదు. దువా అనే పేరు అనుకుని షూటింగ్ లో ఉన్న రణవీర్ కు ఫోన్ చేస్తే తను ఓకె అన్నాడు.
పాప పుట్టాక రెండు నెలల తర్వాత మేము పేరు పెట్టాము. దువా అంటే అరబిక్ లో ప్రార్ధన అని అర్ధం అంటూ చెప్పిన దీపికా పదుకొనె ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది.