Advertisementt

బ్రేక‌ప్ త‌ర్వాత లేడీ డ్యాన్స‌ర్ బ్యాచిల‌ర్ పార్టీ

Thu 08th May 2025 02:48 PM
dhanashree verma  బ్రేక‌ప్ త‌ర్వాత లేడీ డ్యాన్స‌ర్ బ్యాచిల‌ర్ పార్టీ
Dhanashree Verma bachelor party after breakup బ్రేక‌ప్ త‌ర్వాత లేడీ డ్యాన్స‌ర్ బ్యాచిల‌ర్ పార్టీ
Advertisement
Ads by CJ

ఇటీవ‌లే భ‌ర్తకు విడాకులిచ్చిన ప్ర‌ముఖ లేడీ కొరియోగ్రాఫ‌ర్ గురించి చాలా గుస‌గుస‌లు వినిపించాయి. స‌హ‌న‌టుడితో ఎఫైర్ కార‌ణంగానే క్రికెట‌ర్ కి విడాకులిచ్చింద‌ని ప్ర‌చారం సాగింది. అదే స‌మ‌యంలో భ‌ర్త టీవీ చానెల్ లైవ్ లో ఒక అంద‌గ‌త్తె అయిన‌ యూట్యూబ‌ర్ తో క‌లిసి క‌నిపించి షాకిచ్చాడు. కోర్టుల ప‌రిధిలో విడాకులు మంజూరు కావ‌డంతో చివ‌రికి గొడ‌వ స‌ద్ధుమ‌ణిగింది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. కెరీర్ ప‌రంగా బిజీ అయ్యారు.

 

ఇప్పుడు ఈ బ్యూటీ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లో దండ‌యాత్ర చేస్తోంది. ఐటమ్ గాళ్ గా అవ‌తార‌మెత్తి బోల్డ్ డ్యాన్సులతో క‌వ్విస్తోంది. ప్ర‌తిభావంతురాలైన కొరియోగ్రాఫ‌ర్ కావ‌డంతో స‌ద‌రు లేడీ కొరియోగ్రాఫ‌ర్ మూవ్స్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. దానికి త‌గ్గ‌ట్టే భారీ పారితోషికం ఆఫ‌ర్ చేస్తూ ఇటు తెలుగు నిర్మాత‌లు, అటు త‌మిళం, హిందీ నిర్మాతలు స‌ద‌రు భామ‌కు ఐట‌మ్ నంబ‌ర్ల‌లో అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. తాజాగా రాజ్ కుమార్ రావుతో అదిరిపోయే ఐట‌మ్ నంబ‌ర్ లో రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. ఇంత‌కీ ఈ బో* డ్యాన్సింగ్ క్వీన్ ఎవ‌రో చెప్పాల్సిన ప‌ని లేదు. క్రికెట‌ర్ చాహ‌ల్ మాజీ భార్య‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ధ‌న‌శ్రీ వ‌ర్మ‌. రాజ్‌కుమార్ రావు- వామికా గబ్బి నటించిన `భూల్ చుక్ మాఫ్` కోసం `టింగ్ లింగ్ సజ్నా..` అనే పాట‌లో న‌ర్తించింది. ఇది బ్యాచిల‌ర్ పార్టీ నేప‌థ్యంలో సాగే ప్ర‌త్యేక గీతం. ఈ పాట‌లో ధ‌న‌శ్రీ హావ‌భావాల‌ను హైలైట్ చేసే ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. భూల్ చుక్ మాఫ్ ఈనెల 9న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

Dhanashree Verma bachelor party after breakup:

Dhanashree Verma bachelor party

Tags:   DHANASHREE VERMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ