టాలీవుడ్ లో అయినా ఏ భాషలో అయినా ఒక్కో హీరోయిన్ కి ఒక్కో ఏడాది కలిసొస్తుంది అన్నట్టుగా మారింది ప్రస్తుత పరిస్థితి. కొన్నేళ్ల క్రితమైనా ఇప్పుడైనా ఒక్క హీరోయిన్ చుట్టూనే తిరగడం యంగ్ హీరోలకు పరిపాటిగా మారింది. ఒకప్పుడు సమంత, కాజల్, త్రిష, రకుల్ ప్రీత్, తమన్నా వెనుక తిరిగిన హీరోలు ఆ తర్వాత పూజ హెగ్డే, రష్మిక జపం చేసారు.
ఆపై ఒక ఏడాది కృతి శెట్టికి యంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఇచ్చాయి. ఆమె వరస డిజాస్టర్ చూసేసరికి.. శ్రీలీలకు వరసగా ఛాన్స్ లు ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా శ్రీలీల ఒక్క ఏడాదిలో చాలామంది హీరోలను చుట్టేసింది. ఆమె తర్వాత మీనాక్షి చౌదరి హావ నడిచింది. మీనాక్షి చౌదరి బర్త్ డే కి గత ఏడాది వరస సినిమాల అప్ డేట్స్ తో ఆమెకు విషెస్ చెప్పారు.
ఇక ఈ ఏడాది భాగ్యశ్రీ బోర్సే టైమ్ స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది ఆమె బర్త్ డే అంటే మే 6 న ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వచ్చిన అప్ డేట్స్ చూసిన వారు ఒక్కో ఏడాది ఒక్కో హీరోయిన్ టైమ్ నడుస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే కి ఆమె నటిస్తున్న దుల్కర్ సల్మాన్ కాంత టీమ్ స్పెషల్ పోస్టర్ తో విష్ చేసారు
అలాగే రామ్ తో భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న చిత్రం నుంచి పోస్టర్ వదిలారు. ఇక విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే కి కింగ్ డమ్ నుంచి ఆమె లుక్ వదులుతూ బర్త్ డే విషెస్ చెప్పింది టీం. ఇలా మూడు చిత్రాల ఉంచి మూడు వేరియేషన్స్ ఉన్న లుక్స్ తో భాగ్యశ్రీ బో ఆప్రేబ్ అనిపించింది.
సో ఈ ఏడాది భాగ్యశ్రీ బోర్సే హావ టాలీవుడ్ లో కనిపించబోతుంది అనేది ఆమె బర్త్ డే అప్ డేట్స్ చూస్తే అర్ధమవుతుంది.