నాగ చైతన్య- శోభిత పెళ్లి చేసుకున్న సందర్భంలో సమంత ఎక్కడ కనిపించినా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం తెలుగు మీడియా నుంచి పొంచి ఉంది. అంతేకాదు సమంత సెకండ్ మ్యారేజ్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా మీడియా క్యూరియాసిటీగా సమంత కు ప్రశ్నలు సదించేందుకు రెడీగా కూర్చుంది. ఈమధ్య కాలంలో సమంత మీడియా ముందుకు వచ్చింది లేదు.
కానీ ఇప్పుడు సమంత నిర్మాతగా తెరకెక్కిన మొదటి సినిమా శుభం చిత్ర ఇంటర్వ్యూలో సమంతను మీడియా అడిగే ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సమంత ముందే తెలివిగా తను మీడియా ముందు ఇకపై వ్యక్తిగత విషయాలు మట్లాడకూడదని అనుకుంటున్నట్టుగా చెప్పి మీడియాకి షాకిచ్చింది.
గతంలో అంటే నాగ చైతన్య తో డివోర్స్ అయినప్పటి నుంచి ఆమె మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన వరకు ప్రతి ఒక్క విషయాన్ని అందరితో షేర్ చేసుకున్న సమంత ఇకపై పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని డిసైడ్ అయినట్లుగా చెప్పడం చూసి హమ్మ సమంత తను డేటింగ్ లో ఉన్న రాజ్ నిడమోరు గురించి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నావా... నీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్లు.