ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Keerthy Suresh best wishes to Samantha

దోస్త్ మేరా దోస్త్.. సామ్‌కు కీర్తి విషెస్

Keerthy Suresh best wishes to SamanthaKeerthy Suresh best wishes to Samantha

క్యాట్ ఫైట్లు లేవు... గొడ‌వ‌ల్లేవ్.. కొట్టుకోడాల్లేవ్..! ఒక‌రి అవ‌కాశాన్ని ఇంకొక‌రు లాక్కుని వీలున్న‌ప్పుడ‌ల్లా సెటైర్లు చెణుకులు వేసే వాతావ‌ర‌ణం కూడా ఇప్పుడు లేదు. సినీరంగంలో పోటీ ఉన్నా కానీ, ఎవ‌రికి వారే తోపులు. మ‌హాన‌టి గా ఓ వెలుగు వెలిగిన కీర్తి సురేష్ ఆ త‌ర్వాత అగ్ర హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. అదే సమ‌యంలో స‌మంత కూడా కెరీర్ జ‌ర్నీలో ఉన్న‌త స్థాయికి చేరుకుంది. ఆ ఇద్ద‌రూ టాప్ హీరోల‌తో లీగ్ లో ఉన్నా కానీ, ఏనాడూ క్యాట్ ఫైట్ చేయ‌లేదు. ఒక‌రి అవ‌కాశాన్ని ఒక‌రు లాక్కోలేదు.

అంతేకాదు.. ఆ ఇద్ద‌రి స్నేహం ఇండ‌స్ట్రీని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌హాన‌టిలో క‌లిసి ప‌ని చేసిన త‌ర్వాత ఒక‌రికోసం ఒకరుగా మంచి స్నేహితులుగా మారారు. ఒక‌రి సినిమాల‌కు ఒక‌రు ప్ర‌మోష‌న్స్ చేస్తూ, ఫంక్ష‌న్లు పార్టీల్లో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. వీలున్న ప్ర‌తి సంద‌ర్భంలో ఇద్ద‌రూ క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అదంతా స‌రే కానీ, ఇప్పుడు స‌మంత ట్ర‌లాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మొద‌టి సినిమా శుభం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వ్వ‌గా, కీర్తి సురేష్ చిత్ర‌నిర్మాత స‌మంత‌కు త‌న బెస్ట్ విషెస్ చెప్పింది.

కీర్తి సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ ని షేర్ చేసింది. ఏడేళ్ల క్రితం  ఎంతో ఆనందంగా ఉన్నాము. మే 9న స్పెష‌ల్ సినిమా (మ‌హాన‌టి) సెల‌బ్రేష‌న్ త‌ర్వాత అదే రోజు సొంత నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి ఉత్సాహంగా క‌నిపించావ‌ని కీర్తి త‌న స్నేహితురాలు స‌మంత‌కు గుర్తు చేసింది. త‌న బ్యాన‌ర్ కి, రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాకి బెస్ట్ విషెస్ అందించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారుతోంది. కీర్తి ఎర్ర‌చీర‌లో అందంగా స్టెప్పులు వేస్తూ క‌నిపించిన వీడియో వేగంగా దూసుకెళుతోంది.  

Keerthy Suresh best wishes to Samantha for Subham movie success

keerthy suresh