హాలీవుడ్ సినిమాల్లో ప్రియాంక చోప్రా నగ్న సన్నివేశాలు చేసినప్పుడు లేదా రాధికా ఆప్టే సేక్రెడ్ గేమ్స్, పార్చ్డ్ లలో టాప్ లెస్ సీన్ చేసినప్పుడు లేదా మందాకిని చాలా కాలం క్రితం కొన్ని బోల్డ్ సీన్లు చేసినప్పుడు (రామ్ తేరి గంగా మైలీ) వారంతా సమాజంలో అశ్లీలతను వ్యాప్తి చేస్తున్నారని ఎందుకు ఆరోపించలేదు?`` అని ప్రశ్నించింది నటి గెహనా వశిష్ఠ్. తాను నటించిన `హౌస్ అరెస్ట్` రియాలిటీ షో హోస్ట్, నిర్మాతపై మాత్రమే ఎందుకు కేసులు వేసారు? అని కూడా ప్రశ్నించారు. శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది, చిత్ర వాగ్ వంటి ప్రముఖులను అభ్యర్థిస్తూ.. అందరికీ సమన్యాయం వర్తింపజేయమని గెహనా వశిష్ఠ్ తన తాజా పోస్ట్ లో కోరారు. హోస్ట్ అజాజ్ ఖాన్, ఉల్లు యాప్ హౌస్ అరెస్ట్ షో నిర్మాతపై కేసులు నమోదు చేసినట్టే, ప్రియాంక కోప్రా, రాధిక ఆప్టే, రణవీర్ సింగ్ లపైనా కేసులు నమోదు చేయండి అని గెహనా డిమాండ్ చేసారు.
``వారంతా మన గౌరవనీయమైన దేశ పౌరులు. వారికి కూడా ప్రజలకు చూపించే దానిలో సమాన బాధ్యత ఉంది. వారికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. యువత వారిని గౌరవంగా చూస్తారు. కాబట్టి దయచేసి నా అభ్యర్థనను పరిగణించండి.. వారిని అరెస్ట్ చేయండి!`` అని గెహనా వ్యాఖ్యానించారు. అయినా పో* వెబ్‌సైట్‌లను చూసే వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని గెహానా ప్రశ్నించింది. డిజిటల్ రంగంలో సెన్సార్‌షిప్ తీసుకురావాలని కూడా గెహానా అభ్యర్థించారు. అలా చేస్తే నిర్మాతలు నియమాలను పాటించాల్సి ఉంటుందని అన్నారు.
వివాదం పూర్వాపరాల్లోకి వెళితే.. ఇంతకుముందే `హౌస్ అరెస్ట్` నుండి ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో హోస్ట్ అజాజ్ ఖాన్ కెమెరాలో సె* భంగిమలను ప్రదర్శించమని నటి గెహనాని కోరుతూ కనిపించారు. అయితే అక్కడ చూపించేది బికినీ మాత్రమే. షోలో ప్రతి పోటీదారు బికినీలే కాదు అదనంగా దుస్తులను ధరించారు అని తెలిపింది. ఈ వీడియోకు ప్రతిస్పందనగా, జాతీయ మహిళా కమిషన్ (ఎన్.సి.డబ్ల్యూ) అజాజ్ ఖాన్ , ఉల్లు యాప్ సిఇవో విభు అగర్వాల్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ వివాదంపై ఉల్లు యాప్ ఇంకా స్పందించలేదు.