Advertisementt

హిట్ 4 హీరో రివీల్ అయ్యాడు

Thu 01st May 2025 01:20 PM
karthi  హిట్ 4 హీరో రివీల్ అయ్యాడు
Hit 4 hero revealed హిట్ 4 హీరో రివీల్ అయ్యాడు
Advertisement
Ads by CJ

హిట్ ఫ్రాంచైసీలో మూడో భాగంగా వచ్చిన హిట్ 3 నేడు మే 1 న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నాని పెరఫార్మెన్స్ కు ఆడియన్స్ పట్టం కడుతున్నారు. ఓవర్సీస్ షోస్ నుంచే హిట్ 3 కి హిట్ టాక్ పడిపోయింది. అర్జున్ సర్కార్ గా నాని వన్ మ్యాన్ షో అంటూ ఆడియన్స్ ఇస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే హిట్ 3 భారీ కలెక్షన్స్ నమోదు చెయ్యడం పక్కాగా కనిపిస్తుంది. 

ఈరోజు ఓపెనింగ్స్ పరంగానే హిట్ 3 నాని కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచేలా కనిపిస్తుంది. అయితే హిట్ చిత్రంలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా దానికి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 లో అడివి శేష్ హీరోగా కనిపించాడు. ఇప్పుడు హిట్ 3 లో నాని హీరో. హిట్3 కి కంటిన్యూషన్ హిట్ 4 ఉంటుంది. మరి అందులో తమిళ హీరో కార్తీ హీరోగా కనిపిస్తాడని లీకులు ఎప్పుడో కనిపించాయి. 

ఆ విషయంలో దర్శకుడు శైలేష్  కొలను అప్ సెట్ కూడా అయ్యాడు. ఇక ఈ రోజు విడుదలైన హిట్ 3 లో హిట్ 4 హీరోని రివీల్ చేసారు. హిట్ 4 లో తమిళ నటుడు కార్తి హీరో అనే హింట్ ఇచ్చి వదిలారు మేకర్స్. రత్నవేలు పాండియన్ గా కార్తీ హిట్ 3 క్లైమాక్స్ లో గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఎండ్ అయ్యింది. సో హిట్ 4 లో కార్తీ హీరో అని ఆడియన్స్ ఫిక్స్ అవుతున్నారు. 

Hit 4 hero revealed:

Actor Karthi to be seen in Nani HIT 3

Tags:   KARTHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ