Advertisementt

మొదటి సినిమా డిజాస్టర్-అయినా పాప లక్కీ

Thu 01st May 2025 09:39 AM
bhagyashri borse  మొదటి సినిమా డిజాస్టర్-అయినా పాప లక్కీ
The first film was a disaster - but the Heroine was lucky మొదటి సినిమా డిజాస్టర్-అయినా పాప లక్కీ
Advertisement
Ads by CJ

మాస్ రాజా రవితేజ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సేకి హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ రూపంలో బిగ్ షాకిచ్చాడు. ఆ చిత్రం డిజాస్టర్ అవడంతో భాగ్యశ్రీ బోర్సే పని అంతే అనుకున్నారు. కానీ మొదటి సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయినా భాగ్యశ్రీ బోర్సే కి టాలీవుడ్ హీరోలు పట్టం కట్టారు. దర్శకనిర్మాతలు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

అందులో ముందుగా విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లో శ్రీలీల ప్లేసులోకి భాగ్యశ్రీ బోర్సే ని తెచ్చుకున్నారు. ఆ చిత్రం మే చివరి వారంలో విడుదలకాబోతుంది. అంతేకాదు రానా బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ కాంత చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే నే హీరోయిన్. అంతేనా హీరో రామ్ లేటెస్ట్ చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే కథానాయకి. ఈమధ్యన రామ్ తో భాగ్యశ్రీ బోర్సే డేటింగ్ చేస్తుంది అనే టాక్ కూడా నడిచింది. కానీ అది రూమర్ అని తేలిపోయింది. 

ఇప్పుడు ఈ అమ్మడుకి ప్రభాస్-దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో తెరకెక్కే ప్యాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అనే వార్త అందరిని ఆశ్చర్య పరిచింది. ప్రభాస్-హను రాఘవపూడి ప్రస్తుతం ఫౌజీ మూవీ చేస్తున్నారు. దానిలో ఇమాన్వి హీరోయిన్. 

ప్రభాస్-ప్రశాంత్ వర్మ కలయికలో మూవీ చర్చల్లో ఉంది. అందులోకి ప్రభాస్ సరసన భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది. అయితే ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబో ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం లేకపోయినా.. భాగ్యశ్రీ బోర్సే పేరు ప్రభాస్ సరసన వినిపించడం మాత్రం హైలెట్ అనే చెప్పాలి. 

The first film was a disaster - but the Heroine was lucky:

Bhagyashri Borse to romance Prabhas

Tags:   BHAGYASHRI BORSE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ